శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత.. 41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.93 కిలోల హెరాయిన్‌ స్వాధీనం.. జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌.. హ్యాండ్‌ బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ. శంషాబాద్‌ లోని జీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కస్టమర్‌ కేర్‌ విభాగానికి ఆదివారం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాయిస్‌ మెసేజ్‌ వచ్చింది. దీంతో అప్రమత్త మైన విమానాశ్రయ సిబ్బంది హై అలర్ట్ ప్రకటించి ఫిర్యాదు …

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టివేత..

41 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్.. 5.93 కిలోల హెరాయిన్‌ స్వాధీనం..

జాంబియా నుంచి వచ్చిన మహిళా ప్రయాణికురాలి నుంచి డ్రగ్స్ సీజ్‌..

హ్యాండ్‌ బ్యాగ్‌లో డ్రగ్స్ తీసుకొచ్చిన మహిళ.

శంషాబాద్‌ లోని జీఎంఆర్‌ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు కస్టమర్‌ కేర్‌ విభాగానికి ఆదివారం విమానాశ్రయంలో బాంబు పెట్టినట్లు గుర్తు తెలియని వ్యక్తి నుంచి వాయిస్‌ మెసేజ్‌ వచ్చింది.

దీంతో అప్రమత్త మైన విమానాశ్రయ సిబ్బంది హై అలర్ట్ ప్రకటించి ఫిర్యాదు చేశారు. పోలీసులు, బాంబ్ స్క్వాడ్‌లు వేట ప్రారంభించగా అది బూటకమని తేలింది.

విదేశాల నుంచి వచ్చిన సందేశాన్ని కూడా పోలీసులు గుర్తించి విచారణ చేపట్టారు. మరోవైపు విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు భారీ డ్రగ్స్‌ రట్టు చేశారు.

జాంబియాకు చెందిన ఓ మహిళా ప్రయాణికుడి నుంచి 41 కోట్ల విలువైన 5.93 కిలోల హెరాయిన్‌ ను స్వాధీనం చేసుకున్నారు.

మహిళ తన హ్యాండ్‌ బ్యాగ్, సూట్‌కేస్ మరియు డాక్యుమెంట్ హోల్డర్‌లో నిషిద్ధ వస్తువులను దాచిపెట్టింది. దీంతో పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

Updated On 21 Jan 2024 9:46 PM IST
cknews1122

cknews1122

Next Story