అయోమయంలో తెలంగాణ సర్పంచులు ? హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం రూ.లక్షల్లో అప్పులు తెచ్చుకున్న సర్పంచుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. ఫిబ్రవరి మొదటివారంలో పదవీకాలం ముగియనుండ టంతో పెండింగ్​బిల్లులు ఎప్పుడు లభిస్తాయోయని దేవునిపై భారం వేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొం టున్నట్లు తెలుస్తుంది. సర్పంచుల ఆత్మహత్యలు..! జనాభా ప్రతిపాదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు నిధులు కేటాయింపు ఉంటుంది. కానీ రాష్ట్ర నిధులు …

అయోమయంలో తెలంగాణ సర్పంచులు ?

హైదరాబాద్ : బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనుల కోసం రూ.లక్షల్లో అప్పులు తెచ్చుకున్న సర్పంచుల పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది.

ఫిబ్రవరి మొదటివారంలో పదవీకాలం ముగియనుండ టంతో పెండింగ్​బిల్లులు ఎప్పుడు లభిస్తాయోయని దేవునిపై భారం వేసి ఆశగా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులందరూ ఇదే పరిస్థితిని ఎదుర్కొం టున్నట్లు తెలుస్తుంది.

సర్పంచుల ఆత్మహత్యలు..!

జనాభా ప్రతిపాదికన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంచాయతీలకు నిధులు కేటాయింపు ఉంటుంది. కానీ రాష్ట్ర నిధులు ఏడాదిన్నరగా అతీగతీ లేవు. కేంద్రం నుంచి వచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులే గ్రామాలకు దిక్కుగా నిలిచాయి.

ఇవి సిబ్బంది జీతాలు, కరెంట్ బిల్లులు, ట్రాక్టర్​ కొనుగోళ్ల ఈఎంఐలు, ఇతర రోజువారీ కార్యక్రమాలకు ఇవి సరిపోయేవి. మిగిలిన పనుల కోసం సర్పంచులు అప్పులు చేసి లేదా సొంత డబ్బు ఉపయోగించారు. ఇప్పుడు పదవీకాలం దగ్గర పడుతున్నకొద్దీ వారిలో ఆందోళన వ్యక్తమవుతోంది.

పెండింగ్​ బిల్లులు రాకపోవటంతో 13 మంది సర్పంచులు చనిపోయా రంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అప్పటి పురపాలక శాఖ మంత్రి జిల్లాలోనే ఒక సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడి మరణించారు.

ఒక్కో పంచాయతీకి సగటున రూ. 20 లక్షలు పెండింగ్​లో ఉన్నాయని సమాచారం. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా 12,769 పంచాయతీలకు రూ.53,264 కోట్లు పెండింగ్​లో ఉన్నాయని సర్పంచులు చెబుతున్నారు.

బీఆర్​ఎస్​ ప్రభుత్వం ఎన్నికల కోడ్​, ఫ్రీజింగ్​ పేరిట రెండు సార్లు పెండింగ్​లో పెట్టి నిధులు మంజూరు చేయలేదని తెలిపారు.

పశ్చిమ్​ బంగా, కేరళ మోడల్​లో తెలంగాణ లోనూ పనులు చేపట్టాలని, నిధుల విషయంలో హామీగా ఉంటామని కేటీఆర్​ చెప్పగా.. తామంతా అప్పులు తెచ్చి పనులు చేపట్టామని సర్పంచులు వివరించారు.

తీరా బిల్లుల కోసం సర్పంచులు పట్టుబట్టగా ఎన్నికల కోడ్​ రావటం, ఎన్నికల తర్వాత ప్రభుత్వం మారటంతో సర్పంచులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వమే దయతలచి సర్పంచుల పెండింగ్ బిల్లులను విడుదల చెయ్యాలని కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని వేడుకుం టున్నారు.

Updated On 22 Jan 2024 10:16 AM IST
cknews1122

cknews1122

Next Story