HealthHyderabadPoliticalTelangana

స్కూల్లో డ్రగ్స్ తయారీ.. ఎక్కడో కాదు హైదరాబాదులోనే!

స్కూల్లో డ్రగ్స్ తయారీ.. ఎక్కడో కాదు హైదరాబాదులోనే!

స్కూల్లో డ్రగ్స్ తయారీ.. ఎక్కడో కాదు హైదరాబాదులోనే!

పాతబోయినపల్లిలో వెలుగుచూసిన ఘటన

ప్రైవేటు పాఠశాల భవనంలో మత్తు పదార్ధాల తయారీ

ముగ్గురు నిందితులు అరెస్టు

1 కోటి విలువైన 7 కిలోల అల్ప్రాజోలం, రూ.20 లక్షల నగదు స్వాధీనం

హైదరాబాద్ మహానగరంలోని పాతబోయిన్‌పల్లిలో ఓ ప్రైవేటు పాఠశాల తరగతి గదుల్లో మత్తు పదార్థాల తయారీ కేంద్రం బయటపడటం సంచలనంగా మారింది. విద్యాబుద్ధులు నేర్పే పవిత్ర స్థలంలోనే చట్టవిరుద్ధంగా అల్ప్రాజోలం అనే మత్తుమందును తయారు చేస్తుండటం పోలీసులను, ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది.

ఈ ఘటన స్థానికంగా ఉన్న మేధా ప్రైవేట్ పాఠశాలలో చోటుచేసుకుంది. పాఠశాల రెండో అంతస్తులో అక్రమంగా మత్తు పదార్థాల తయారీ జరుగుతోందన్న సమాచారంతో ఈగల్ బృందం పోలీసులు ప్రత్యేక దాడులు నిర్వహించి, రహస్యంగా కొనసాగుతున్న ఈ వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చారు.

దాడిలో వెలుగుచూసిన షాకింగ్ నిజాలు :

పాఠశాల నిర్వాహకుడైన జయప్రకాశ్ గౌడ్ రెండు గదుల్లో అల్ప్రాజోలం తయారీ యంత్రాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున మత్తు పదార్థాలు తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రసాయన దుకాణాల నుంచి ముడి సరుకులు తెచ్చి, 6-7 దశల్లో ప్రాసెస్ చేసి మత్తు మందు తయారు చేస్తున్నట్టు విచారణలో తేలింది.

ఉదయం పాఠశాల తరగతులు జరుగుతుండగానే, అదే సమయంలో పై అంతస్తులో ఈ దందా సాగుతోంది. స్థానికులకు ఎటువంటి అనుమానం రాకుండా పాఠశాలను అడ్డుగా ఉపయోగించుకున్నాడు.

పోలీసుల సోదాల్లో స్వాధీనం :

సోదాల అనంతరం ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి రూ. 20 లక్షల నగదు, దాదాపు రూ. కోటి విలువైన 7 కిలోల అల్ప్రాజోలం స్వాధీనం చేసుకున్నారు.

విద్యార్థుల భద్రతపై ఆందోళన :

ప్రస్తుతం పాఠశాలలో పదో తరగతి వరకు విద్య కొనసాగుతోంది. ఈ ఘటన వెలుగులోకి రావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమ పిల్లలు చదువుకునే చోటే మత్తు పదార్థాల తయారీ జరుగుతుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నారు.

తదుపరి విచారణ : ఈ కేసును అన్ని కోణాల్లో విచారిస్తున్న ఈగల్ బృందం.. నిందితులు అల్ప్రాజోలంతో పాటు మరిన్ని మత్తు పదార్థాల తయారీలో కూడా భాగమై ఉండవచ్చన్న అనుమానంతో దర్యాప్తు కొనసాగిస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button