వెంకటాపురం జిపి పాలన,అగ్ర నాయకులు ఉన్న వీధుకే అభివృద్ధి
“కాలినడకకు సైతం అనుకూలత శూన్యం”
“ప్రభుత్వాలు మారిన జిపి పాలన ఒకటే”
“సర్పంచ్ ఎన్నికలకు మళ్లీ ఇలాంటి వాళ్లను ప్రజలు వీధులకు చారనిస్తారా..?”
“ములుగు జిల్లా సి కె న్యూస్ ప్రతినిధి భార్గవ్”
ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని, మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని బిసి’ మరిగుడెం గ్రామానికి ఆనుకుని దగ్గరలో ఉన్న అంగాలవారి పక్క వీధిలో మేజర్ గ్రామపంచాయతీ పరిధిలో, నివాసం ఉంటున్న, గ్రామస్తులకు కాలినడకకు కూడా అనుకూలత లేని, పంచాయతీ రోడ్డు,
ఇదే విషయమై గ్రామస్తులు పలుమార్లు. మండల ఉన్నత అధికారికి మరియు మేజర్ జిపి ప్రజా ప్రతినిధులకు రోడ్డు విషయమై అధికారులకు గ్రామస్తులు విన్నవించుకున్నప్పటికీ, వినిపించుకొని సంబంధిత పాలకులు. ప్రజా ప్రతినిధులు మండలంలో పరిపాలించే తీరుపై, పలు కులాలకు అనుకూలంగా పాలన కొనసాగిస్తున్నారు.
జిపి పాలకులు అనే విషయంపై, గ్రామస్తుల్లో పలు ఆరోపణలు నిలువెత్తుతున్నాయి. జిపికి ఎంత బడ్జెట్ వచ్చినా. అధికారులు మాత్రం బాధితులకు బడ్జెట్ లేదనే’ పాతపాటే పాడుతున్నారు. మరి మండలంలో వెలుస్తున్న నూతన సిసి రోడ్లకు సర్వే సేకరణ చేసేది ఎవరు.?
అగ్ర నాయకుల వీధులు మాత్రమే అభివృద్ధి చేసేందుకు మండల అధికారుల ఆసక్తి ఏమిటి.! అనే ప్రశ్న మాత్రం గ్రామస్తులకు సమాధానం లేని’ ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇంటి పన్నులు వసూళ్లు చేసేందుకు మాత్రమే మా వీధులు గుర్తుంటాయి.
అభివృద్ధి పథకాలు వచ్చినప్పుడు మాత్రం ప్రజా ప్రతినిధులు మా వీధులకు ఆమడ దూరంలో ఉంటారు అంటూ, బాధితులు వాపోయారు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించాలి అని ఏర్పడే వ్యతిరేకతకు ప్రజా ప్రతినిధుల పాలనే కారణం అంటూ ప్రజలు బదులిచ్చారు.