షర్మిల వైఎస్ఆర్ బిడ్డ కాదు..సోనియా పెంపుడు కూతురు ..! కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటూనే అన్న జగన్‌తో వైరం తప్పదని బలమైన సంకేతాలు పంపారు. జగన్‌తో గట్టిగానే పోరాడుతానని షర్మిల స్పష్టం చేశారు. అన్న పార్టీపై షర్మిల ఈ రేంజ్‌లో విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే వైసీపీ నాయకులు కూడా ఇదే రేంజ్‌లో షర్మిలపై ఎదురుదాడికి దిగారు. షర్మిల వైఖరి చూసిన తరువాత అధికార వైసీపీ నుంచి కూడా విమర్శలు మొదలైయ్యాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఒక్కొక్కరు బయటకు …

షర్మిల వైఎస్ఆర్ బిడ్డ కాదు..సోనియా పెంపుడు కూతురు ..!

కాంగ్రెస్ బాధ్యతలు తీసుకుంటూనే అన్న జగన్‌తో వైరం తప్పదని బలమైన సంకేతాలు పంపారు. జగన్‌తో గట్టిగానే పోరాడుతానని షర్మిల స్పష్టం చేశారు.

అన్న పార్టీపై షర్మిల ఈ రేంజ్‌లో విమర్శలు చేస్తారని ఎవరూ ఊహించలేదు. అయితే వైసీపీ నాయకులు కూడా ఇదే రేంజ్‌లో షర్మిలపై ఎదురుదాడికి దిగారు.

షర్మిల వైఖరి చూసిన తరువాత అధికార వైసీపీ నుంచి కూడా విమర్శలు మొదలైయ్యాయి. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఒక్కొక్కరు బయటకు వచ్చి షర్మిలపై విమర్శలు చేస్తున్నారు. ఏపీలో వైఎస్ షర్మిల హడావిడి చూశాకా బాధపడ్డాం.. ఇప్పుడు జాలి పడుతున్నామన్నారు.

ఏపీలో ఉనికి లేని పార్టీ కాంగ్రెస్ అంటూ షర్మిలను ఎద్దేవా చేశారు సజ్జల రామకృష్ణా రెడ్డి. తెలంగాణలో పోటీ చేస్తానన్న షర్మిల ఎందుకు వెనుకడుగు వేశారని ఆయన ప్రశ్నించారు.

చంద్రబాబు కుట్రలో చివరి అస్త్రంగా షర్మిలను ప్రయోగించారని సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయడమే షర్మిల లక్ష్యమని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కూడా షర్మిల తీరుపై విమర్శలు చేశారు.

వైఎస్ఆర్ కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఎంత దారుణంగా అవమానించిందో అందరికి తెలుసునని ..పామును అయినా నమ్ముతారేమో గానీ కాంగ్రెస్‌ను మాత్రం ఏపీ ప్రజలు ఎప్పటికీ విశ్వసించరని పరొక్షంగా షర్మిలను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు.

తాజాగా ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే మరో అడుగు ముందుకేసి షర్మిలపై ఘాటు విమర్శలు చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ..షర్మిలను కేవలం కాంగ్రెస్ నాయకురాలుగా మాత్రమే చూస్తామని..

అంతేకాని వైఎస్ఆర్ కూతురుగా షర్మిలను చూడదల్చుకోలేదని ఆయన వ్యాఖ్యనించారు. ఏపీలో షర్మిల ప్రభావం శూన్యమన్నారు. వైఎస్ఆర్ రక్తానికి షర్మిల చెడ్డ పేరు తీసుకువచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

వైఎస్ఆర్ కుటుంబాన్ని వేధించిన కాంగ్రెస్ పార్టీలో చేరినప్పుడు షర్మిల మీద అభిమానం చనిపోయిందని..ఇక మీదట ఆమెను వైఎస్ఆర్ బిడ్డగా కంటే .. సోనియా పెంపుడు కూతురుగానే చూస్తామని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు.

జగన్ పాలన తప్పు పట్టేంత స్థాయి, అర్హత షర్మిలకు లేదని ఆయన తేల్చి చెప్పారు. షర్మిలపై వైసీపీ నాయకుల ఎదురుదాడి చూసిన తరువాత ఆ పార్టీ నాయకులు ఆమెను తమ ప్రత్యర్థిగానే భావిస్తున్నట్టే ఉన్నారు. రాబోవు రోజుల్లో ఈ మాటల దాడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Updated On 24 Jan 2024 12:26 PM IST
cknews1122

cknews1122

Next Story