ఏమీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు...
ఏమీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు.. దానికి సాక్ష్యం మా అమ్మే : షర్మిల విజయవాడ: అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని చెప్పారు. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. కపట ప్రేమ …
![ఏమీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు... ఏమీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు...](https://cknewstv.in/wp-content/uploads/2024/01/images-2-4-1.jpeg)
ఏమీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు.. దానికి సాక్ష్యం మా అమ్మే : షర్మిల
విజయవాడ: అన్ని వర్గాల వారి కోసం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రూపొందించారని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. ఆయన భారీ విగ్రహాలు పెడితే పేదల ఆకలి తీరదని చెప్పారు.
విజయవాడలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఆమె ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైకాపా నేతలు చేస్తున్న విమర్శలపై స్పందించారు.
కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలి. "రాష్ట్రంలో దళితులపై దాడులు వందశాతం పెరిగిపోయాయి. దారుణంగా చంపి డోర్ డెలివరీ చేసినవారిని పక్కన పెట్టుకుంటున్నారు. అంబేడ్కర్ గురించి గొప్పగా చెప్పడం కాదు..
ఆయన ఆశయాలను అమలు చేయాలి. కొందరు నియంతల్లా మారి రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారు. ఎస్సీ ,ఎస్టీ నిధులు దారి మళ్లించి సొంత అవసరాలకు వాడారు.
దళితులపై కపట ప్రేమ చూపేవారికి తగిన బుద్ధి చెప్పాలి. ప్రాంతీయ పార్టీలు బడుగు, బలహీనవర్గాలను సమానంగా చూడటం లేదు. 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వని పార్టీలకు మద్దతు తెలపబోమని ప్రజలు ప్రమాణం చేయాలి
వైఎస్‌ఆర్ కుమార్తెను.. వైఎస్ షర్మిల ఎందుకు కాను?
ఎవరూ కితాబు ఇవ్వకపోతే నా విలువ ఎక్కువ కాదు.. తక్కువా కాదు. నేను వైఎస్‌ఆర్ కుమార్తెను అయినప్పుడు వైఎస్ షర్మిల కాకుండా ఎలా ఉంటాను. నా కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నా.
నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవరెడ్డి కూడా నేను అడిగి పాదయాత్ర చేశానని మాట్లాడారు. మీ ఆరోపణలు నిజం కాదని నేను ప్రమాణం చేయగలను.
మీరు చేయగలరా? అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారు. ఇవాళ్టి వరకూ ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు. దానికి సాక్ష్యం మా అమ్మే. మీకు దమ్ముంటే మా అమ్మను అడగండి" అని షర్మిల వ్యాఖ్యానించారు.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)