గణతంత్ర దినోత్సవ వేడుకలలో అపశృతి.. ఇద్దరు మృతి
ములుగు ప్రతినిధి: ములుగు జిల్లా కేంద్రంలో గణతంత్ర దినోత్సవం వేళ తీవ్ర విషాదం చోటు చేసుకుంది.
శుక్రవారం గణతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎస్సీ కాలనీలో కొందరు యువకులు కలిసి ఇనుప పోల్‌కు జాతీయ జెండాని ఎగరవేయాలని భావించారు.
అయితే జాతీయ జెండా అమర్చే క్రమంలో ప్రమాదవశాత్తు పైనున్న విద్యుత్ తీగలు తగిలి బోడ విజయ్(25) అంజిత్(35) చక్రి (25)లు విద్యుత్ ఘాతానికి గురి కాగా స్థానికులు హుటాహుటిన ములుగు ఏరియా హాస్పిటల్‌కి తరలించారు.
అప్పటికే విజయ్ అజిత్‌లో మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. స్వల్ప గాయాలతో చక్రి క్షేమంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. గణతంత్ర దినోత్సవ సందర్భంగా విద్యుత్ ఘాతంతో ఇద్దరు మృతి చెందడంతో జిల్లా కేంద్రంలో విషాదఛాయలు అనుకున్నాయి.
మృతుల కుటుంబాలకు అండగా ఉంటా.. : మంత్రి సీతక్క
ప్రమాదవశాత్తు విద్యుత్ ఘాతానికి గురై చనిపోయిన యువకుల కుటుంబాలకు తక్షణ ఆర్థిక సహాయం కింద పదివేలు అందజేశాము.
విద్యుత్ శాఖ తరపున ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల నష్టపరిహారం అందేలా చూస్తాను మరియు వారి కుటుంబానికి అండగా ఉంటాం.