స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్‌హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. అనంతరం, సీఎం రేవంత్‌.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి …

స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్‌
హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి.. స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు.

వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు.

వివరాల ప్రకారం.. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో రిపబ్లిక్‌ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్‌ రెడ్డి హాజరయ్యారు. అనంతరం, సీఎం రేవంత్‌.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను కలిసి పరామర్శించారు. కాగా, ఇటీవలే స్పీకర్‌ ప్రసాద్‌ అనారోగ్యానికి గురయ్యారు.

మరోవైపు.. తమ్మినేని వీరభద్రాన్ని కూడా సీఎం రేవంత్‌ పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం రేవంత్‌.. తమ్మినేనిని పరామర్శించారు. కాగా, తమ్మినేనికి ఇటీవల స్ట్రోక్‌ రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Updated On 26 Jan 2024 2:47 PM IST
cknews1122

cknews1122

Next Story