ప్రమాద వాసత్తు కాలువలో జారీ పడి బాలుడు మృతి
బాలుడి మృతికి ప్రభుత్వం భాద్యత వహించాలి
పది లక్షలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని డిమాండ్ చేసిన సర్పంచి నర్సింహా మూర్తి
జనవరి 28.
సీకే న్యూస్ ములుగు జిల్లా వెంకటాపురం మండల ప్రతినిధి ప్రశాంత్.
ములుగు జిల్లా నూగూరు
వెంకటాపురం మండలంలోని బర్ల గూడెం గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న ఒంటి మామిడి గ్రామంలో ఆదివారం విషాదం చోటు చేసుకున్నది.
ఏడాదిన్నర వయసు ఉన్న మడకం మన్విత్ అనే బాలుడు ఆడుకుంటూ కాలువ దాటే క్రమంలో నీటిలో ప్రమాదవ శాత్తు పాలెం వాగు ప్రాజెక్టు ప్రధాన కాలువలో జారి పడి మృతి చెందినాడు. ఒంటి మామిడి గ్రామానికి చెందిన శ్యామల రామకృష్ణ,రాధ దంపతులకు మంజిత్ మాన్విత అనే ఇద్దరులు కుమారులు ఉన్నారు.
చిన్న కుమారుడు మన్విత్ ఉదయం 9 గంటల సమయం లో ఆడుకోవడానికి వెళ్లి అనంత లోకానికి వెళ్ళినాడు. తల్లిదండ్రులు వ్యవసాయ పనిలో నిమగ్నమై ఉండగా తమ కుమారుడు ఆడుకుంటూ అటువైపు కాలువలో పడి మృతి చెందినట్లు సమాచారం
ఇది ప్రభుత్వ హత్య : పాలెం వాగు ప్రాజెక్ట్ లో పడి ఇప్పటి వరకు ఆరుగురు ఆదివాసీ బిడ్డలు చనిపోయారని సర్పంచ్ కొర్స నర్సింహా మూర్తి ఆరోపించారు. ఇవన్నీ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే జరుగుతున్నట్లు తెలిపారు. శ్యామల మన్విత్ మరణానికి కారణం ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు.
ఒంటిమామిడి గ్రామ ప్రజలు కాలువ అవతల వైపు వెళ్ళడానికి ఒక బ్రిడ్జి కట్టాలని ఎన్నిసార్లు చెప్పిన అధికారులు పట్టించు కోలేదని మండిపడ్డారు. ఇంకా ఎంతమంది చనిపోతే పాలకులకు చలనం వస్తోందో ఆందోళన వ్యక్తం చేశారు.
చనిపోయిన మన్విత్ తల్లితండ్రులకు పది లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియా చెల్లించాలని సర్పంచ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాలెం వాగు కాలువ గ్రామానికి దెగ్గరగా ఉన్న చోట ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని ప్రాజెక్ట్ అధికారులకు సూచించారు.