అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఇలా.. మారేడుమిల్లి , రంపచోడవరం, వైరామవరం సీఐడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టులు భర్తీ చేస్తున్నట్లు సీడీపీవోలు సంధ్యారాణి, ప్రసన్న తెలిపారు. ధారగెడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో మినీ అంగన్‌వాడీ కార్యకర్త, పుల్లంగి కేంద్రంలో సహాయకురాలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మారేడుమిల్లి సీడీపీవో కార్యాలయంలో వచ్చేనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. వివాహిత, ఎస్టీ మహి ళ అభ్యర్థులు అర్హులని తెలిపారు. పదో తరగతి …

అంగన్‌వాడీ పోస్టులకు దరఖాస్తు చేసుకోండి ఇలా..

మారేడుమిల్లి , రంపచోడవరం, వైరామవరం సీఐడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో ఖాళీలగా ఉన్న అంగన్‌వాడీ కార్యకర్త, సహాయకురాలు పోస్టులు భర్తీ చేస్తున్నట్లు సీడీపీవోలు సంధ్యారాణి, ప్రసన్న తెలిపారు.

ధారగెడ్డ అంగన్‌వాడీ కేంద్రంలో మినీ అంగన్‌వాడీ కార్యకర్త, పుల్లంగి కేంద్రంలో సహాయకురాలు పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు. మారేడుమిల్లి సీడీపీవో కార్యాలయంలో వచ్చేనెల 10తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

వివాహిత, ఎస్టీ మహి ళ అభ్యర్థులు అర్హులని తెలిపారు. పదో తరగతి పాసై ఉండాలన్నారు. నియామకం నాటికి 21 సంవత్సరాలు నిండి 35 సంవత్సరాల లోపు వయసు కలిగి ఉండాలన్నారు.

దరఖాస్తుదారులు తహసీల్దార్‌ నుంచి కులధ్రువీకరణ, నివాస ధ్రువీకరణ పత్రం, విద్యార్హతల ధ్రువపత్రాలు, ఆధార్‌, రేషన్‌కార్డు గెజిటెడ్‌ అధికారితో ధ్రువీకరించి సమర్పించాలన్నారు.

రంపచోడవరం ఐసీడీఎస్‌ పరిధిలో రంప అంగన్‌వాడీ కేంద్రంలో సహాయకురాలు, చొప్పగొండ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్త పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలిపారు.

స్దానికంగా నివాసం ఉన్న అర్హులైన గిరిజన మహిళ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. అర్హత పొందిన అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించే తేదీ, స్థలం వివరాలు తెలియజేస్తామన్నారు.

Updated On 29 Jan 2024 10:52 AM IST
cknews1122

cknews1122

Next Story