మొన్న కుంగింది .. ఇప్పుడు కూలిపోయే స్థితిలో మెడిగడ్డ బ్యారేజ్ …
గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన భారీ నీటి ప్రాజెక్టు కాళేశ్వరం నాణ్యతపై విమర్శలు మర్చిపోక ముందే ఇప్పుడు మరికొన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చాయి.
వేల కోట్ల రూపాయలతో చేపట్టిన పనులు పూర్తిగా నిర్లక్ష్యంగా, కాంట్రాక్టర్ల కక్కూర్తితో నాణ్యతారాహిత్యంగా చేపట్టారనడానికి మరో ఉదాహరణ బయటపడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్ పూర్ మండలం మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బ్యారేజ్ స్వరూపం మారిపోయింది.
గేట్లు కింది భాగంతో పాటు గేట్లు అమర్చడానికి ఏర్పాటు చేసిన సపోర్ట్ వాల్స్ పూర్తిగా పగుళ్లు రావడమే కాకుండా 6,8 బ్లాకులలో మరిన్ని పియర్స్ కు నష్టం వాటిల్లినట్లుగా న్యూస్ 18 సేకరించిన వీడియో ఆధారంగా బయటకు వచ్చింది.
బ్యారేజీకి దిగువన 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ సుమారు 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. గత బీఆర్ఎస్ (BRS)పాలకులు ఈ మేడిగడ్డ బ్యారేజ్ పనుల కోసం 3652 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇంత పెద్ద మొత్తంలో డబ్బు చెల్లించి నాణ్యత లేకుండా నిర్మించడం..
ఇంత త్వరగా అవి శిథిలావస్థకు చేరుకోవడం చూసి ప్రస్తుత ప్రభుత్వ పెద్దలు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్ల ప్రజాధనాన్ని కాజేసి నాసిరకంగా ప్రాజెక్టు బ్యారేజి నిర్మించారని ఆరోపిస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజ్ కి పగుళ్లు…. తెలంగాణలో భారీగా డబ్బులు ఖర్చు చేసి అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో నాణ్యతలోపం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తోంది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటడుతున్న బ్యారేజీ పగుళ్లు, వంతెన పిల్లర్లు కుంగిపోవడం వంటి వాటితో పాటు తాజాగా మేడిగడ్డ బ్యారేజీ దగ్గర గేట్ల కింద నిర్మించిన వాల్ పూర్తిగా ధ్వంసమయ్యే పరిస్థితికి వచ్చింది.
ఇప్పటికే బ్యారేజీకి దిగువన 20 టన్నుల బరువుతో ఉన్న సిమెంట్ బ్లాక్స్ సుమారు 100 మీటర్ల మేర కొట్టుకుపోయింది. గేట్లు కింది భాగంతో పాటు గేట్లు అమర్చడానికి ఏర్పాటు చేసిన సపోర్ట్ వాల్స్ పూర్తిగా పగుళ్లు రావడమే కాకుండా 6,8 బ్లాకులలో మరిన్ని పియర్స్ కు నష్టం వాటిల్లినట్లుగా న్యూస్ 18 సేకరించిన వీడియో ఆధారంగా బయటకు వచ్చింది.
బయటపడుతున్న నిర్మాణ లోపాలు.. పెచ్చులు పెచ్చులుగా కాకుండా భారీగా పగుళ్లు, గోడలు క్రాక్స్ రావడంతో స్థానికులతో పాటు ప్రస్తుత అధికార పార్టీకి చెందిన నేతలు గత పాలకులపై మండిపడుతున్నారు.
ఇదంతా కాంట్రాక్టులు డబ్బులు మిగుల్చుకునేందుకు నాణ్యత లేకుండా పనులు చేపట్టడం వల్లే జరిగిందని ..దీనికి గత పాలకుల వైఖరే కారణమని చెబుతున్నారు.
మరోవైపు కాంగ్రెస్, బీజేపీ నేతలు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అంచనాలు పెంచి భారీగా అక్రమాలకు పాల్పడ్డారని దీనిపై పూర్తిగా విచారణ జరిపించాలని కూడా కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఇప్పుడు జరిగిన డ్యామేజ్ కి మరింతగా సీరియస్ అవుతున్నారు.