విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ..
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి (సంపత్) జనవరి 31
ఆలేరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో బుధవారం రోజున ఘనంగా స్వపరిపాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.
పాఠశాల విద్యార్థినులు వివిధ పాత్రలు విద్యాశాఖధికారిగా,డి ఈ ఓ, డిప్యూటీ.ఈ.ఓ గా, కలెక్టర్,డాక్టర్,ఎమ్మెల్యేగా పోషించారని ప్రధానోపాధ్యాయురాలు ఏ.లక్ష్మి తెలిపారు.అలాగే బాలికల పాఠశాల విద్యార్థులు జిల్లా స్థాయి సైన్స్ ఫెయిర్ లో ద్వితీయ స్థానం పొందడం సంతోషంగా ఉందని వారు తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…బాలికలు చక్కగా చదువుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని తెలుపుతూ వారిని అభినందించారు.. అలాగే ఎనిమిదవ తరగతి విద్యార్థిని ప్రణతి (బర్డ్ డ్రోన్) సొంత ఆలోచన ప్రతిభ కనబరిచిన ఆమె ను అభినందించారు.
అలాగే గైడ్ టీచర్లుగా వ్యవహరించిన ఉపాధ్యాయురాలు అలివేలు మంగమ్మ,పార్వతి లను ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయురాలు సునీత,అలివేలు మంగమ్మ ఉషారాణి,మమత,పార్వతి బాలమణి,రేణుక,ప్రభ,సబిత పాల్గొన్నారు..