రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి ck news పశ్చిమబెంగాల్ : జనవరి 31కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర బిహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి ప్రవేశించింది. షెడ్యూల్‌లో ప్రకారం ఇవాళ మధ్యాహ్నం మాల్దాకు చేరుకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది. అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. కారు మీదకు ఎక్కి నినాదాలు …

రాహుల్ గాంధీ కారుపై దుండగుల దాడి

ck news

పశ్చిమబెంగాల్ : జనవరి 31
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడ్ న్యాయ్ యాత్ర బిహార్ రాష్ట్రం నుంచి ఇటీవలే పశ్చిమ్ బెంగాల్‌లోకి ప్రవేశించింది.

షెడ్యూల్‌లో ప్రకారం ఇవాళ మధ్యాహ్నం మాల్దాకు చేరుకున్న యాత్రలో భద్రతా లోపం కొట్టొచ్చినట్లుగా కనిపించింది.

అయితే, ర్యాలీ సందర్భంగా కొందరు దుండగులు రాహుల్ గాంధీ కారుపై దాడికి తెగబడి అద్దాలు పూర్తిగా ధ్వంసం చేశారు. కారు మీదకు ఎక్కి నినాదాలు చేసే యత్నం చేశారు.

ఈ క్రమంలో కారు విండ్‌షీల్డ్‌ పగిలిపోయింది. దీంతో రాహుల్‌ భద్రతా సిబ్బంది వారిని వారించి కిందకు దించగా.. పగిలిన కారు అద్ధాలతోనే ఆయన ర్యాలీని ముందుకు సాగించారు…

Updated On 31 Jan 2024 6:00 PM IST
cknews1122

cknews1122

Next Story