ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా విధులు నిర్వహిస్తున్న యాదయ్య గుండెపోటుతో మృతి.. సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి సంపత్ ఫిబ్రవరి 01 ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా విధులు నిర్వహిస్తున్న పెద్దగోని యాదయ్య గురువారం నాడు గుండెపోటుతో మృతి చెందాడు..వివరాలకు వెళితే తెలంగాణ ప్రభుత్వం గ్రామ రెవిన్యూ సహాయకులను ఇరిగేషన్,మిషన్ భగీరథ శాఖలలో లస్కర్,హెల్పర్ లు గా నియమించడం జరిగింది. కానీ వారికి ఎంప్లాయిస్ గుర్తింపు సంఖ్య,వేతనాలు రాకపోవడంతో గత అరునెలలుగా ఇబ్బందులు …

ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా విధులు నిర్వహిస్తున్న యాదయ్య గుండెపోటుతో మృతి..
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి సంపత్ ఫిబ్రవరి 01
ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా విధులు నిర్వహిస్తున్న పెద్దగోని యాదయ్య గురువారం నాడు గుండెపోటుతో మృతి చెందాడు..వివరాలకు వెళితే తెలంగాణ ప్రభుత్వం గ్రామ రెవిన్యూ సహాయకులను ఇరిగేషన్,మిషన్ భగీరథ శాఖలలో లస్కర్,హెల్పర్ లు గా నియమించడం జరిగింది.
కానీ వారికి ఎంప్లాయిస్ గుర్తింపు సంఖ్య,వేతనాలు రాకపోవడంతో గత అరునెలలుగా ఇబ్బందులు పడుతూ వలిగొండ మండలంలో ఇరిగేషన్ శాఖలో లస్కర్ గా విధులు నిర్వహిస్తూ ఆర్థిక ఇబ్బందులతో మనస్థాపం చెంది గురువారం గుండె పోటు తో పెద్దగోని యాదయ్య మృతి చెందడం జరిగింది.
యాదయ్య కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని, పూర్వపు విఆర్ఏ హక్కుల సాధన సమితి రాష్ట్ర కో చైర్మన్ దాసరి వీరన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు,హెల్పర్,లస్కర్ గా నియమించిన వారికి ఎంప్లాయిస్ గుర్తింపు సంఖ్య, మరియు వేతనాలు త్వరగా వచ్చేవిదంగా చూడాలి అని అధికారులను వారు కోరినారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మేకల ,యాదగిరి, చిత్తలూరి స్వామి, సాయి మల్లు,స్వామి, కానుగుల శ్రీనివాస్,ఎడ్ల వెంకన్న,బుంగ చరణ్ రాజ్, ఈదుల బాలస్వామి, బందెల వీరస్వామి,దొడ్డి ప్రేమయ్య, కడారి సత్తయ్య,తదితరులు పాల్గొన్నారు…
