టీడీపీ కృషి మరువ లేనిది.. కాంగ్రెస్ గెలుపు కోసం నిద్ర పోకుండా పని చేశారు..
ఇటీవల జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థుల విజయం కోసం కృషి చేసిన టిడిపి శ్రేణులకు కృతజ్ఞతలు తెలిపిన పొంగులేటి
కృతజ్ఞత భావంతో టిడిపి కార్యాలయాన్ని సందర్శించిన మంత్రి పొంగులేటి
ఈరోజు తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు డాక్టర్ వాసిరెడ్డి రామనాథం అధ్యక్షతన జరిగిన సమావేశం లో తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ గృహ నిర్మాణ శాఖ మరియు సమాచార శాఖా మాత్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టిడిపి కార్యాలయానికి విచ్చేసి కృతజ్ఞతా సభా సమావేశంలో పాల్గొనటం జరిగింది,
ఈ కార్యక్రమంలో ముందుగా కార్యాలయంలోని అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు పూలమాలవేసి నివాళులర్పించారు అనంతరం ఖమ్మ పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అధ్యక్షులు మాట్లాడుతూ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు టిడిపి కార్యాలయానికి రావడం చాలా సంతోషంగా ఉందన్నారు,
అసెంబ్లీ ఎలక్షన్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో విజయ దుందుభి మ్రోగించుటలో టీడీపీ కీలక పాత్ర వహించిందన్నారు వారి సత్తా చాటారన్నారు, బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని మార్చాలనే ప్రజల కోరిక మేరకే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోనికి రావటానికి టీడీపీ తోడ్పడిందని రామనాధం అన్నారు
ఆరు గ్యారెంటీలను అమలుపరచుటలో తమ పాత్ర పోషించి సంపూర్ణంగా పథకాలు విజయవంతం అయ్యేలా చేయాలన తెలంగాణ తెలుగుదేశంపార్టీ తరపున మంత్రివర్యులు కోరుతున్నామన్నారు
రాష్ట్ర ప్రజలకు స్వచ్ఛమైన పాలన అందించి రాష్ట్ర ప్రజలకు అండదండలుగా వుండేందుకు ఇప్పటికే తీసుకుంటున్న నిర్ణయాలు ప్రశంస నీ ఉన్నాయన్నారు ఎన్టీఆర్ జయంతి వర్ధంతి లను ప్రభుత్వ పరంగా జరపాలన్నారు
ఎన్టీఆర్ కు భారత రత్న బిరుదును కేంద్ర ప్రభుత్వం ప్రధానం చేయటానికి అమాత్యులు ప్రభుత్వం తమవంతు కృషి చేయాలని రామనాధం కోరారు అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూతెలంగాణ రాష్ట్రంలో మార్పు కావాలని రాజకీయంగా తెలుగుదేశంపార్టీకి ఏమీ లాభం లేకపోయినా ప్రజల అభీష్టం మేరకు మాకు మద్దతు తెలిపారు,
రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు పూర్తి మద్దతు తెలిపారని
తెలంగాణ ప్రజలు ఏది కావాలనుకుంటున్నారో అదినెరవేరిందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆదమర్చి నిద్రపోయారేమో కానీ తెలుగు తమ్ముళ్లు మాత్రం కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే వరకు ఎక్కడా నిద్రపోలేదని
దాని ఫలితం గత ప్రభుత్వ అహంకారాన్ని పూరిత నిర్ణయాలకి చరమగీతం పాడామని అన్నారు,
జాతీయ నాయకులు పెద్దలు నారా చంద్రబాబు గారికి లోకేష్ బాబుకు తెలంగాణ రాష్ట్ర తెలుగుదేశంపార్టీ కార్యవర్గ సభ్యులు తెలుగు తమ్ముళ్లకు నా తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు వారు చేసిన సహకారాన్ని కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ మర్చిపోదని అన్నారు,
మీరు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు కాదు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న మీరు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోమన్నారు. భవిష్యత్ రాజకీయాల్లో మనందరం కలిసి ప్రయాణం చేద్దాం… అని అన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి ప్రధాన కార్యదర్శి కూరపాటి వెంకటేశ్వర్లు ఉపాధ్యక్షులు కొండబాల కరుణాకర్ సీతయ్య వంగాల రామకోటి మల్లాది హనుమంతరావు జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి కేతినేని హరీష్ పార్టీ అధికార ప్రతినిధి మల్లెంపాటి అప్పారావు ఖమ్మం నగర టీడీపీ అధ్యక్షులు వడ్డం విజయ రాష్ట్ర జిల్లా మహిళా నాయకు రాళ్ళు రాజేశ్వరి మందపల్లి రజనీ తదితర పార్టీ నేతలు పాల్గొన్నారు.