సంఘమిత్ర సేవా సమితి ఆధ్వర్యంలో ఆలేరు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల కు స్కూల్ బెంచులు అందజేత….
సి కే న్యూస్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి సంపత్ ఫిబ్రవరి 01
సంఘమిత్ర సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఆలేరు ఎస్సీ కాలనీకి చెందిన ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో గురువారం రోజున పిల్లలకు కూర్చోడానికి స్కూల్ బెంచులు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా సంస్థ వ్యవస్థాపకులు బొట్ల సంపత్ మాట్లాడుతూ…పిల్లలకు పునాది అయినటువంటి ప్రాథమిక పాఠశాలలో సదుపాయాలు,నాణ్యత కలిగిన చదువు అందించ గలిగితే పిల్లలకు సరైన భవిష్యత్తు ఇవ్వగలుగుతాం అని అన్నారు.
అదే విధంగా ఆలేరు పట్టణ కేంద్రంలో ఉచిత బస్తీ ట్యూషన్లు ప్రారంభించబోతున్నామని వారు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రొటేరియన్ కోటగిరి అమర్నాథ్,పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పి సరోజ, ఉపాధ్యాయులు జి మాధవ రెడ్డి,సంస్థ జిల్లా అధ్యక్షులు కంతుల శంకర్,చుక్క చంద్రయ్య,స్థానిక నాయకులు బడుగు జహంగీర్, పస్తం ఆంజనేయులు,ఎగ్గిడి శీను,సుక్కరాజు,మాధవ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.