గృహనిర్మాణ శాఖ ఉద్యోగులను నా కుటుంబ సభ్యులుగా చూస్తాను: మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
– ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ లు పరిష్కరిస్తానని హామీ
ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాటు 10 ఏoడ్ల పాటు ఇబ్బంది పడినారు. ఇందిరమ్మ రాజ్యంలో పేదలందరికీ ఇండ్లు
హైదరాబాద్ : మినిస్టర్స్ క్వార్టర్స్ లో రెవెన్యూ మినిస్టర్ గారి క్యాంప్ కార్యాలయంలో తెలంగాణా రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అసిస్టెంట్ ఇంజనీర్స్ &వర్క్ inspectors assosiation ముద్రించిన డైరీ & క్యాలండర్ ను శనివారం రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార శాఖ మంత్రి వర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆవిష్కరించి ప్రసంగించారు .ఈ సందర్భముగా మంత్రి వర్యులు మాట్లాడుతూ హౌసింగ్ ఉద్యోగుల సంక్షేమం,సమస్యల పరిష్కారం భాధ్యత నాది అని అన్నారు గత ప్రభుత్వం హౌసింగ్ ను ,ఉద్యోగులను ఛిద్రం చేసి ఎన్నో రకాల ఇబ్బందులకు గురిచేసింది,మా ప్రభుత్వం గృహ నిర్మాణ సంస్థ ఉద్యోగులను సొంత కుటుంబ సభ్యులు మాదిరిగా కాపాడు కుంటాను మీరు ఆందోళన చెంద వద్దు అని అంటూ మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు జరగాలని ఆకాంక్షించారు.ఇంకా ఈ సమావేశం లో హౌసింగ్ చీఫ్ ఇంజనీర్ ఈశ్వరయ్య,సంఘం అధ్యక్షుడు గవ్వ రవీందర్ రెడ్డి,వర్కింగ్ ప్రెసిడెంట్ బొగ్గుల వెంకట రామిరెడ్డి, కార్య దర్శి రఘువీర్ ప్రసాద్ గుప్తా,జనరల్ మేనేజర్లు చైతన్య, balaram , JRS కుమార్,ఆంజనేయులు,జగన్, అథార్,భాస్కర్ రెడ్డి, దుర్గా ప్రసాద్,ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.