కాంగ్రెస్‌లో సునామీ సృష్టించనున్న ఖమ్మం ఎంపీ సీటు ఖమ్మం లోక్ సభ సీటు కాంగ్రెస్ లో సునామీ సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అగ్రనేతలంతా ఖమ్మం ఎంపీ సీటు బంధవులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.ఇటీవల మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని లేకుంటే, తానే బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు. ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం …

కాంగ్రెస్‌లో సునామీ సృష్టించనున్న ఖమ్మం ఎంపీ సీటు

ఖమ్మం లోక్ సభ సీటు కాంగ్రెస్ లో సునామీ సృష్టించే అవకాశం కనిపిస్తోంది. అగ్రనేతలంతా ఖమ్మం ఎంపీ సీటు బంధవులకు ఇప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇటీవల మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ప్రెస్ మీట్ పెట్టి ఇక్కడి నుంచి సోనియా గాంధీ పోటీ చేస్తారని లేకుంటే, తానే బరిలో నిలుస్తానని స్పష్టం చేశారు.

ఇదే సీటు కోసం కేంద్ర మాజీమంత్రి రేణుకాచౌదరి, మరో రాష్ట్రమంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోదరుడు ప్రసాదరెడ్డి, ఖమ్మం జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు పువ్వాడ దుర్గాప్రసాద్‌లు కూడా పోటీలో ఉన్నారనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది. కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ తెలంగాణ నుంచి పోటీ చేస్తే.. ఖమ్మం లోక్‌సభ సెగ్మెంట్‌ నుంచి బరిలో ఉంటారనే వార్తలు కూడా వస్తున్నాయి.

తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని రేసులోకి వచ్చారు. ఖమ్మం పార్లమెంట్ సీట్ కోసం దరఖాస్తు సమర్పించారు.

తన మద్దతుదారులతో కలిసి అట్టహాసంగా గాంధీ భవన్‌కు వచ్చి స్వయంగా దరఖాస్తు చేశారు. ఇప్పటికే ఆమె మద్దతుదారులు ఒకసారి దరఖాస్తు సమర్పించారు. 500 కార్ల కాన్వాయ్ తో ఖమ్మం నుంచి ఆమె భారీ ర్యాలీగా తరలివచ్చారు.

ఖమ్మం లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. సోనియా, ప్రియాంక పోటీకి దిగినా.. లేక హైకమాండ్ ఎవరికి టికెట్ ఇచ్చినా కలిసి పని చేస్తామని తెలిపారు.

మల్లు భట్టి విక్రమార్క హైకమాండ్ వద్ద కూడా తన భార్యకు టిక్కెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి పేరునూ సిఫారసు చేయడం లేదని.. సోనియా గాంధీని మాత్రం పోటీ చేయాలని కోరుతున్నారని అంటున్నారు.

కాంగ్రెస్ హైకమాండ్ ఎవరికి సీటిస్తే వారిని గెలిపిస్తామని చెబుతున్నారు. మొత్తంగా ఖమ్మం ఎంపీ సీటు హాట్ ఫేవరేట్‌గా మారింది. ఎవరికి కేటాయించినా మరికొంత మంది అసంతృప్తికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి.

Updated On 4 Feb 2024 5:46 PM IST
cknews1122

cknews1122

Next Story