— కాంట్రాక్టు లను మోసం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే సండ్ర దే.
— ఆర్థిక ఇబ్బందులు తో ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ కుటుంబాలు ఏనో….
—- అక్రమంగా కేసులు పెట్టించింది సండ్ర వెంకట వీరయ్యనే….
సండ్ర వెంకట వీరయ్య అసత్య ఆరోపణలు పై ఖండించిన నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు.
సిక్కి న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
స్థానిక కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం 5 మండలాల ముఖ్య కాంగ్రెస్ నాయకులు కలిసి బి అర్ ఏస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ పార్టీ పై, కాంగ్రెస్ నాయకులు పై చేసిన అబద్దపు, బుటకపు మాటలపై తీవ్రంగా ఖండిస్తూ, వారి గత అవినీతి పరిపాలన పై ఆధారాలతో తిప్పికొట్టి ఖండించిన సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు.
కాంగ్రెస్ సీనియర్ నాయకులు ప్రెస్ మీట్ లో మాజీ ఎమ్మెల్యే పై హాట్ కామెంట్స చేసినారు అవి ఎన్నికలు వస్తున్న సందర్బంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వం లో డబ్బులు లేకుండానే సత్తుపల్లి నియోజకవర్గం లోని గ్రామాల్లో వందలాది అభివృద్ధి పనులకు శంకుస్థాపన లు చేసి ప్రజలను మరియు కాంట్రాక్టు లను మోసం చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే సండ్ర దక్కుతుంది అని గత ప్రభుత్వ కాలంలో మాజీ ఎమ్మెల్యే కాంట్రాక్టు ల నుండి లక్షలు, లక్షలు కమీషన్ లు వసూలు చేసారు అని గత ప్రభుత్వ కాలంలో సర్పంచ్ లు, కాంటాక్ట్ లు డబ్బులు కోసం ఆఫీస్ లు చుట్టూ తిరిగిన డబ్బులు ఇవ్వకపోవటం తో ఆర్థిక ఇబ్బందులు తో ఆస్తులు అమ్ముకొని రోడ్డున పడ్డ కుటుంబాలు ఎంతో మంది ఈ సత్తుపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే బి అర్ ఏస్ పార్టీ బాధితులు వున్నారు అనీ అన్యాయం గా,అక్రమంగా కేసులు పెట్టి ప్రజలపై, నాయకులు పై కేసులు పెట్టి ఎంతో మందిని ఎన్నో ఇబ్బందులు పెట్టిన ఘనత సండ్ర ది అన్నారు.
తెలంగాణ రాష్ట్ర0 లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చి 2 నెలలు కాకా ముందే అభివృద్ధి పనులు, ప్రభుత్వ హామీ పథకాలు పై నిజం లేని మాటలు మాజీ ఎమ్మెల్యే మాట్లాడటం అన్యాయం, హాస్యాస్పదం సత్తుపల్లి నియోజకవర్గం లో గెలిచి 2 నేలలు కాకా ముందే కాంగ్రెస్ ముఖ్య మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు సహాయం తో సుమారు 75 కోట్లతో గ్రామాల్లో, పట్టణాల్లో ఎన్నో ప్రభుత్వ అభివృద్ధి పనులు ప్రారంభ దశలో ఉన్నాయి అని తెలుసుకోండి అని బి అర్ ఏస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే తెలుసుకుంటే మంచిది అని తెలిపారు.
ఇలా పలు విషయాలు పై బి అర్ ఏస్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే పై సత్తుపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు విరుచుకుపడ్డరు.
ఈ కార్యక్రమం లో సత్తుపల్లి మున్సిపల్ వైస్ చైర్మన్ తోట సుజాల రాణి,కాంగ్రెస్ సత్తుపల్లి మండలం అధ్యక్షులు శివ వేణు, వేంసూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాదె చెన్నారావు, దొడ్డా శ్రీనివాస్ రావు,కొత్తూరు ప్రభాకర్ రావు,వంకాయల పాటి వెంకటేశ్వర రావు,గురునాధ రెడ్డి,ఉడతానేని అప్పారావు, సుబ్బారెడ్డి,గడిపర్తి శ్రీనివాస్ రావు, పసుమర్తి చంద్రరావు,సోమిరెడ్డి,చీకటి రామారావు, అట్లూరి సత్యనారాయణ రెడ్డి,చిన్న స్వామి, పొట్లపల్లి వెంకటేశ్వర రావు మరియు 5 మండలాల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.