మద్యం మత్తులో ఫైట్.. మధ్యలో వెళ్లిన రూరల్ ఏస్ఐ పై దాడి చేసిన గ్యాంగ్ దాబాలో మద్యం గ్యాంగ్​ హల్చల్ దాబాల్లో అర్థరాత్రి వరకు మద్యం సేవించడం.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఇదేంటని అడిగిన వారి పై దాడి చేయడం పరిపాటిగా మారింది.పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టిన అఘంతుకులు తప్పించుకోవడం మామూలుగా మారింది. దాబాల్లో మద్యం, స్టఫ్​ తిని బిల్లు ఇవ్వమంటే ఎదురు తిరిగి నిర్వాహకులపై దాడి చేసిన ఘటన రూరల్​ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు …

మద్యం మత్తులో ఫైట్.. మధ్యలో వెళ్లిన రూరల్ ఏస్ఐ పై దాడి చేసిన గ్యాంగ్

దాబాలో మద్యం గ్యాంగ్​ హల్చల్

దాబాల్లో అర్థరాత్రి వరకు మద్యం సేవించడం.. ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించడం ఇదేంటని అడిగిన వారి పై దాడి చేయడం పరిపాటిగా మారింది.పోలీసులు పటిష్ఠ నిఘా పెట్టిన అఘంతుకులు తప్పించుకోవడం మామూలుగా మారింది.

దాబాల్లో మద్యం, స్టఫ్​ తిని బిల్లు ఇవ్వమంటే ఎదురు తిరిగి నిర్వాహకులపై దాడి చేసిన ఘటన రూరల్​ మండలంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..రూరల్​ మండలం కోదాడ క్రాస్​ రోడ్డు వద్ద రమేష్​దాబా-2లో ఖమ్మం రేవతిసెంటర్​కు చెందిన పలువురు యువకులు మద్యం సేవించి స్టఫ్​ తిని నాలుగు వేలు బిల్​ చేశారు.

నిర్వాహకులు బిల్లు​ ఇవ్వమని అడిగితే వారి పై దాడికి దిగారు. అదే టైంలో తెల్దారుపల్లికి చెందిన రాంబాబు, ఉపేందర్​లు కూడా రోటీలు తింటున్నారు. దాడికి దిగిన సందర్భంలో గ్యాంగ్​ వచ్చి రాంబాబు పై పడటంతో గొడవ మొదలైంది.

రాంబాబు, ఉపేందర్​ల పై కూడా ప్రతి దాడికి దిగారు. ఈ దాడిలో రాంబాబు తలకు గాయమైంది. విషయం తెలుసుకున్న రూరల్​ ఎస్​ఐ సురేష్​ సంఘటన స్థలానికి వచ్చి గ్యాంగ్​ను అదుపులోకి తీసుకుని స్టేషన్​కు తరలించారు.

స్టేషన్​ ముందు రేవతిసెంటర్​కు చెందిన యువకులు మరో 20 మంది వచ్చి నానా హైరానా సృష్టించారు. ఎస్​ఐ సురేష్​ ఇరువర్గాలను వారించి శాంతిపజేశారు. రాంబాబు నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు రేవతిసెంటర్​కు చెందిన ఆరుగురి పై పలు సెక్షన్​ల కింద కేసు నమోదు చేసి క్షతగ్రాతులైన రాంబాబు, ఉపేందర్​ను

ఖమ్మం నగరంలోని ప్రభుత్వ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ గమనించిన గ్యాంగ్​ ఒక్కసారిగా 50 మందికి పైగా హాస్పిటల్​లో ఉన్న వారి పై దాడికి దిగారు. అక్కడే ఉన్న ఎస్​ఐ సురేష్​ పై కూడా గ్యాంగ్​ దాడికి దిగింది.

తెల్దారుపల్లికి చెందిన యువకులపై దాడి చేయాలని ప్రయత్నించగా అడ్డుకున్న ఎస్​ఐ సురేష్​ తలకు, చేతికి గాయాలైయ్యాయి. ఎస్​ఐ సురేష్​ సంఘటన స్థలంలో లేకపోతే ప్రాణనష్టమే జరిగేదని పలువురు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.

ధైర్యంగా ఎదురునిలబడి మద్యం మత్తులో ఉన్న గ్యాంగ్​ను నిలువరించడంలో తన ప్రాణాలనుసైతం లేక్కచేయకుండా అడ్డుకున్న ఎస్​ఐ సురేష్​ ధైర్యసాహసాలను పలువురు కొనియాడుతున్నారు. రేవతి సెంటర్ గ్యాంగ్ కోసం పోలీసులు గాలించగా ఇప్పటికి 13 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరి పై ఖమ్మం టూ టౌన్​లో కూడా పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

Updated On 4 Feb 2024 6:39 PM IST
cknews1122

cknews1122

Next Story