రెండు లక్షల విలువైన గంజాయి పట్టివేత….
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 05,
భద్రాచలం ఏఎస్పి పారితోష్ పంకజ్, ఉత్తర్వుల మేరకు, సోమవారం ఫారెస్ట్ చెక్ పోస్ట్ , భద్రాచలం వద్ద విజయ లక్ష్మి ఎస్సై మరియు పోలీస్ సిబ్బంది వెహికల్ చెకింగ్ విధులలో భాగంగా వాహనాలు తనిఖీ చేస్తుండగా భూపాల్ పల్లి జిల్లా కు చెందిన బౌత్ రాకేష్ మరియు రాజు లు స్నేహితులు.
తల్లిదండ్రులు ఇచ్చే పాకెట్ డబ్బులు మరియు కూలి చేసిన డబ్బులు జల్సా లకు అతిగా ఖర్చు చేసుకొని, సరిపోకపోవడం వల్ల గంజాయి వ్యాపారం చేయాలని ఆలోచన వచ్చి, వీరు ఒక మోటార్ సైకిల్ పై ఆంధ్ర ఒరిస్సా సరిహద్దులలోనీ కలిమేల పరిసర ప్రాంతాల లో ఋషి అనే వ్యక్తీ వద్ద కొనుగోలు చేసి భూపాల్ పల్లి జిల్లాలో చిన్న చిన్న ప్యాకెట్లు చేసి అవసరమైన వ్యక్తుల కు అమ్ముటకు అక్రమంగా తరలిస్తుండగా, మొదటి వ్యక్తి బౌతు రాకేష్ నీ పట్టుకున్నారు .
రెండో వ్యక్తి రాజు మోటార్ సైకిల్ దిగి పరారు అయినాడు. ఇట్టి పట్టుబడిన నిందితుని వద్ద నుండి 7 కిలోల గంజాయి ఒక మోటార్ సైకిల్, ఒక సెల్ ఫోనును స్వాధీనం చేసుకున్నారు వీటి విలువ 02 లక్షలు ఉంటుంది.
భద్రాచలం టౌన్ సిఐ నాగరాజు కేసు నమోదు చేసి నిందితున్ని రిమాండ్ కు తరలించారు . మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు అని తెలిపేరు.