ఇంటూరి శేఖర్ అరెస్ట్..ధర్నాకు దిగిన తాత మధు !
ఖమ్మం జిల్లాలో మరో అరాచకం తెరపైకి వచ్చింది. తాజాగా బీఆర్ఎస్ పార్టీ నేత ఇంటురి శేఖర్ అరెస్ట్ అయ్యారు. నిన్న అర్థరాత్రి తన స్వగ్రామం జిల్లా చెరువులో బీఆర్ఎస్ పార్టీ నేత ఇంటురి శేఖర్ ను అరెస్టు చేశారు పోలీసులు.
తన ఇంటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నేత ఇంటురి శేఖర్ ను ఖమ్మం పాత సీపీ ఆఫీస్ వరకు, అక్కడ నుంచి నేలకొండపల్లి వివిధ పోలీస్ స్టేషన్ లకు తరలించారు.
ఈ తరుణంలోనే… ఇంటురి శేఖర్ ను అకారణంగా అర్థరాత్రి అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తాతా మధు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అనంతరం హుటా హూటిన నేలకొండపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు తాతా మధు, బెల్లం వేణు, ఉన్నమ్ బ్రహ్మయ్య, ముత్యాల అప్పారావు, ఆసీఫ్ తదితరులు చేరుకున్నారు.
వెంటనే ఇంటురి శేఖర్ ను విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ముందు ధర్నాకు దిగారు బీఆర్ఎస్ నేతలు. జీళ్ళ చెరువు అక్రమ మట్టి తవ్వకాల ఘటనలో ఇంటూరీ శేఖర్ కీలక పాత్ర పోషించారట. ఈ కేసులోనే అరెస్ట్ చేసినట్లు సమాచారం.