తూప్రాన్ అక్షర ప్లానెట్ స్కూల్లో దారుణం
ఆరేళ్ల చిన్నారిపై అఘాయిత్యం
సి కె న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ ఫిబ్రవరి 08
ఆలస్యంగా వెలుగు చూపిన ఘటన టీచర్ పై ఫోక్స్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలింపు పాఠశాలను వెంటనే సిజ్ చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్
మెదక్ జిల్లా తూప్రాన్ పట్టణంలోని ప్రైవేట్ స్కూల్లో దారుణం జరిగింది,
అభం, శుభం తెలియని యూకేజీ చదువుతున్న ఆరేళ్ల చిన్నారిపై ఆ స్కూల్ టీచర్ అఘాయిత్యానికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది, అత్యాచారానికి పాల్పడిన ఆ దుర్మార్గపు టీచర్ పై తూప్రాన్ పోలీసులు ఫోక్స్ చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు, అయితే ఈ దారుణ సంఘటన స్కూల్ యజమాన్యం, పోలీసులు కలిసి బయటకు పోకుండా జాగ్రత్తపడి గోపత్యను పాటించారు,
పట్టణంలోని నర్సాపూర్ చౌరస్తా హైవే అండర్ పాస్ బ్రిడ్జి పక్కన పాత నలంద కాలేజ్ భవనంలో కొనసాగుతున్న అక్షర ద ప్లానెట్ స్కూల్లో ఈ దారుణం జరిగింది, యూకేజి చదువుతున్న ఆరేండ్ల పసిపాపపై అదే స్కూల్లో కామందులైన గోకులాకర్( 35) అనే ఉపాధ్యాయుడు స్కూల్ ఆవరణలో ఆడుకుంటున్న పాపను బాత్రూంలోకి తీసుకెళ్లి దారుణంగా హత్యాచారం చేశాడు,
తీవ్ర రక్త సావ మై పాప స్పృహ తప్పి పడిపోయింది, అయితే దానికి స్కూల్ యజమాన్యం అసలు విషయాన్ని దాచిపెట్టి ఏదో దెబ్బ తాకి పడిపోయిందని తల్లిదండ్రులకు నమ్మించే ప్రయత్నం చేశారు, అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు,
మెడికల్ రిపోర్ట్ లో అత్యాచారం చేసినట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు నిందితుడిపై ఫోక్స్ చట్టం కింద అరెస్టు చేశారు, అయితే తాజాగా ఈ దారుణం ఈ నోట ఆ నోట బయటపడింది, వివరాలు ఏమాత్రం బయటకు పోకుండా యజమాన్యం ప్రధాన పత్రికలు మొదలుకొని , విద్యాశాఖ, పోలీసులు సైతం మేనేజ్ చేశారని పుకార్లు వస్తున్నాయి,
అయితే సీబీఎస్ఈ సిలబస్ అని చెప్పుకుంటున్న పాఠశాలలో సిసి కెమెరాలు లేకపోవడం పలు అనుమాన దారి తీస్తుంది, అయితే అత్యాచారం ఘటన జరిగిన వెంటనే సిసి కెమెరాలు తొలగించారు అని ఆరోపణలు వస్తున్నాయి, విషయం తెలుసుకున్న పేరెంట్స్ తమ పిల్లల్ని స్కూల్లో పంపించడానికి భయపడుతున్నారు,
పిల్లల ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తున్న స్కూల్ లపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, స్కూల్ అనుమతులు రద్దు చేయాలని, పిల్లల భవిష్యత్తును కాపాడాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి