మల్లారెడ్డి కాలేజి హాస్టల్‌లో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్.. అర్ధరాత్రి విద్యార్థుల ఆందోళన
మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతుంది. ఫీజుల రూపంలో యాజమాన్యం వేధింపులు భరించలేక ఓ విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరువక ముందే
బుధవారం యూనివర్సిటీ హాస్టల్ బొద్దింకలు తిన్న ఆహారం తిని కొందరు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.సుమారు 26 మంది విద్యార్థులు అస్వస్థతకు గురికాగా ముగ్గురు విద్యార్థులకు సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం.
కళాశాల ముందు విద్యార్థుల ఆందోళన
కళాశాల యాజమాన్య వైఖరితో మల్లారెడ్డి యూనివర్సిటీలోని విద్యార్థినిలు యూనివర్సిటీ ముందు ఆహారంలో బొద్దింకలు పడి పలువురు అస్వస్థకు గురైన పట్టించుకోక పోగా వేధింపులకు గురిచేస్తున్నారని యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగారు. ఇంచార్జ్ ప్రవీణ్ రెడ్డి పరోక్షంగా విద్యార్థినిలను బెదిరిస్తున్నట్లు సమాచారం.
విద్యార్థులకు బాసట విద్యార్థి సంఘాలు
మల్లారెడ్డి యూనివర్సిటీ హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారన్న సమాచారంతో ఎన్‌ఎస్‌యుఐ నాయకులు యూనివర్సిటీ ముందు ఆందోళణకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులు అస్వస్థకు గురైన కనీసం ప్రధమ చికిచ్చ అందించలేదన్నారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కలుషిత ఆహారం తిని విద్యార్థులు అస్వస్థతకు గురైనా పోలీస్‌లకు తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయం.