నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ప్రతిపక్ష హోదాలో బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నా యి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్‌ సమా వేశాలు ప్రారంభమవుతా యి. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. గతేడాది డిసెంబర్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చారు. అయితే ఆ సమ …

నేడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నా ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క

ప్రతిపక్ష హోదాలో బడ్జెట్ సమావేశాలకు హాజరుకానున్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నా యి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగంతో బడ్జెట్‌ సమా వేశాలు ప్రారంభమవుతా యి.

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. గతేడాది డిసెంబర్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిం చారు. అయితే ఆ సమ యంలో కేవలం సభ్యుల ప్రమాణస్వీకారం, పలు సమస్యలపై సభ పరిమితం కాగా..

కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జరిగే తొలి బడ్జెట్‌ సమావేశాలు కావటంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది.రేపు గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ జరుగు తుంది.

అదే రోజు శాసనసభ కార్యకలాపాల సలహా కమిటీ,బీఏసీ సమావేశాన్ని నిర్వహించి, సభను ఎన్ని రోజులు నడపాలనే దానిపై నిర్ణయం తీసుకుంటారు. డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఫిబ్రవరి 10న ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.

అనంతరం బడ్జెట్‌పై సాధారణ చర్చ జరగనుంది. నేడు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై ప్రసంగం అనంతరం సభ వాయిదా పడుతుంది.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత మొదటిసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా… పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండి తొలిసారి బడ్జెట్‌ సమావేశాల్లో పాల్గొంటోంది.

పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూప టానికి ప్రభుత్వం సిద్ధమ వుతుండగా.. వాటిని సమర్థవంతంగా తిప్పికొ ట్టేందుకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతోంది.

ఆరు గ్యారంటీల అమలులో భాగంగా రూ.500కు గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్‌ పథకాలపై సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో ప్రకటిం చనున్నారు.

సాగునీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రం, కాళేశ్వరంపై విజిలెన్స్‌ రిపోర్ట్‌, కాగ్‌, ధరణిపై నివేదికలను ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలున్నట్లు సమాచారం….

Updated On 8 Feb 2024 8:44 AM IST
cknews1122

cknews1122

Next Story