టీఎస్ లాసెట్, ఈసెట్ 2024 షెడ్యూల్ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే "TS LAWCET 2024 Notification : తెలంగాణ ఉన్నత విద్యామండలి2024-25 విద్యా సంవత్సరానికి గానూ లాసెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడేళ్ల, అయిదేళ్ల లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(TS LAWCET- 2024), పీజీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సెట్ (TS PGLCET- 2024) ప్రవేశపరీక్షలకు షెడ్యూల్ను ఖారరు చేసింది. మరోవైపు ఈ నెల 14న ఈసెట్(TS ECET-2024) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది.. "TS LAWCET …

టీఎస్ లాసెట్, ఈసెట్ 2024 షెడ్యూల్ విడుదల- దరఖాస్తులు ఎప్పటినుంచంటే

"TS LAWCET 2024 Notification : తెలంగాణ ఉన్నత విద్యామండలి2024-25 విద్యా సంవత్సరానికి గానూ లాసెట్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. మూడేళ్ల, అయిదేళ్ల లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(TS LAWCET- 2024), పీజీ లా కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ సెట్ (TS PGLCET- 2024) ప్రవేశపరీక్షలకు షెడ్యూల్ను ఖారరు చేసింది. మరోవైపు ఈ నెల 14న ఈసెట్(TS ECET-2024) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది..

"TS LAWCET 2024 Notification Released : లా విద్యను అభ్యసించాలనుకునే వారికోసం శుభవార్త. ఏటా ఉన్నత విద్యామండలి నిర్వహించే న్యాయవిద్య(TS LAWCET- 2024) నోటిఫికేషన్కు షెడ్యూల్ విడుదలైంది.

ఎల్ఎల్బీ, ఎల్ఎల్ఎం పరీక్ష నిర్వహణకు ఈ నెల 28న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ఉన్నత విద్యామండలి ప్రకటించింది. మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్టు పేర్కొంది. జూన్ 3వ తేదీన టీఎస్ లా సెట్, పీజీఎల్ సెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

"టీఎస్ లాసెట్

2024 నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 28నదరఖాస్తుల స్వీకరణ : మార్చి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు

"పరీక్ష తేదీ : జూన్ 3న..

గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ - వయోపరిమితి 46 ఏళ్లకు పెంపు

"TS ECET 2024 Notification : మరోవైపు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఈసెట్ షెడ్యూల్ను విడుదల చేసింది. ఈ నెల 14న ఈసెట్(TS ECET-2024) నోటిఫికేషన్ ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు విద్యార్థులు ఈసెట్కి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చునని స్ఫష్టం చేసింది. రూ.500ల లేట్ ఫీజుతో ఏప్రిల్ 22 వరకు, 1000 రూపాయల లేట్ ఫీజుతో ఏప్రిల్ 28 వరకు ఆన్లైన్ దరఖాస్తులు స్వీకరించనున్నట్టు స్ఫష్టం చేసింది. మే 1 నుంచి విద్యార్థులు హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని స్ఫష్టం చేసింది. మే 6వ తేదీన ఈసెట్ పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రకటించింది.

"టీఎస్ ఈసెట్ నోటిఫికేషన్ విడుదల : ఫిబ్రవరి 14దరఖాస్తుల స్వీకరణ : ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 16 వరకు..

పరీక్ష తేదీ : మే 6న

TS Eamcet Renamed as EAPCET : రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎంసెట్ పేరును మారుస్తూ ఉన్నత విద్యా మండలి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు టీఎస్ ఎంసెట్ పేరును టీఎస్ ఈఏపీసెట్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరం నుంచి టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడిసిన్ స్థానంలో టీఎస్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీగా మారుస్తున్నట్టు స్పష్టం చేసింది.

టీఎస్ ఈఏపీసెట్ను(TS EAPCET) మే 9 నుంచి 13వ తేదీ వరకు నిర్వహించనున్నట్టు ఉన్నత విద్యామండలి స్పష్టం చేసింది.

మే 9 నుంచి 11 వరకు ఇంజినీరింగ్, 12, 13 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశాలకు పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. జేఎన్టీయూ హైదరాబాద్ ఆధ్వర్యంలో మొత్తం నాలుగు రోజుల పాటు టీఎస్ ఈఏపీసెట్ జరుగుతుందని పేర్కొంది.

మే 6న ఈసెట్, మే 23న టీఎస్ ఎడ్సెట్, జూన్ 3న లాసెట్, పీజీఎల్ సెట్లు, జూన్ 4, 5 తేదీల్లో ఐసెట్ నిర్వహించనున్నట్టు తెలిపింది. ఎంటెక్, ఎంఫార్మ్ కోర్సుల్లో చేరే వారి కోసం జూన్ ఆరు నుంచి 8 వరకు పీజీ ఈసెట్, జూన్ 10 నుంచి 13 వరకు టీఎస్ పీఈసెట్ జరుగుతుందని స్పష్టం చేసింది..

Updated On 9 Feb 2024 9:12 PM IST
cknews1122

cknews1122

Next Story