ఏసీబీ వలలో చిక్కుకున్న ఏ ఈ
సికె న్యూస్ ప్రతినిధి
మహబూబ్ నగర్ జిల్లా మున్సిపల్ కార్యాలయంలో పని చేస్తున్న టౌన్ ఏఈ పృథ్వి శనివారం ఏసిబి అధికారులకు పట్టుబడ్డాడు.
ఏసీబి డిఎస్పి కృష్ణ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం మున్సిపల్ కాంట్రాక్టర్ పి. యాదయ్య నుంచి 50 వేలు లంచం తీసుకుంటుండగా పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో ప్రత్యక్షంగా పట్టుకోవడం జరిగిందని తెలిపారు.
కాంట్రాక్టర్ గత సంవత్సరం మున్సిపాలిటీకి సంబం ధించి రెండు పనులకు ఆన్లైన్లో టెండర్ వేసి 11 లక్షలకు దక్కించుకున్నాడని తెలిపారు.
ఈ పనులను పూర్తి చేసిన కాంట్రాక్టర్ యాదయ్య ఆ పనులకు సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో ఎంవి రికార్డు చేయాలని ఏఈ పృద్విని కోరగా లంచం డిమాండ్ చేశాడని తెలిపారు.
ఈ విషయాన్ని కాంట్రాక్టర్ యాదయ్య ఈనెల 7వ తేదీన ఎసిబికి ఫిర్యాదు చేశాడని చెప్పారు.. పథకం ప్రకారం ఏఈ పృద్వికి ఒప్పుకున్న 50 వేల రూపాయలు పట్టణంలోని మెట్టుగడ్డ సమీపంలో యాదయ్య ఇస్తుండగా ప్రత్యక్షంగా పట్టుకొని అతనిపై కేసు నమోదు చేశామని తెలిపారు.
అనంతరం విచారణ నిమి త్తం నిందితుడిని మున్సిపల్ కార్యాలయానికి తీసుకొచ్చి అందుకు సంబంధించిన ఫైల్స్ పరిశీలించామని, రేపు ఏసిబి స్పెషల్ కోర్టు నాం పల్లిలో అప్పగిస్తా మని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగులు డబ్బులు డిమాండ్ చేస్తే ఏసీబీ టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని లేదా నేరుగా మహబూబ్నగర్ కార్యాలయంలో సమాచా రం ఇవ్వవచ్చని వెల్లడిం చారు.