బి ఆర్ ఎస్ నాయకుని మృతి
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 10
భువనగిరి పట్టణానికి చెందిన బీ ఆర్ ఎస్ నాయకులు, పార్టీ పట్టణ మాజీ కార్యదర్శి రావుల శ్రీనివాస్ శనివారం సాయంత్రం 6 గంటలకు యశోద హాస్పిటల్ లో మృతి చెందారు. గత కొంత కాలంగా ఆయన కాలేయం వ్యాధితో బాధపడుతున్నారు.
మూడు రోజుల క్రితం చెకప్ కోసం వెళ్లిన శ్రీనివాస్ డాక్టర్ల సలహా మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు.చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. శ్రీనివాస్ గతంల టీ ఆర్ ఎస్ పార్టీ తరపున కౌన్సిలర్ గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రావులశ్రీనివాస్ భార్య అనురాధ భువనగిరి లోని రాంనగర్ లోని అంగన్వాడీ కేంద్రంలో టీచర్ గా పనిచేస్తున్నారు.
ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు.భువనగిరి లోని రాంనగర్ లో శ్రీనివాస్ టెంట్ హౌస్ నడిపేవారు. భువనగిరి మండలం సిరివేణికుంటకు చెందిన శ్రీనివాస్ కుటుంబం చాలా ఏళ్ళ క్రితం భువనగిరికి వచ్చి స్థిరపడ్డారు.
రావుల శ్రీనివాస్ మృదు స్వభావం హకలిగి,అందరితో కలిసి మెలిసి ఉండేవాడిని ఆయన మృతి తీరని లోటని సామాజిక కార్యకర్త కొడారి వెంకటేష్ అన్నారు. రావుల శ్రీనివాస్ కు వినమ్ర నివాళులు అర్పించిన వెంకటేష్ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేసారు.కుటుంబ సభ్యులు మనోధైర్యం తో ఉండాలని ఆయన కోరారు.