యువకుడు అదృశ్యం సి కే న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ ఫిబ్రవరి 11 మెదక్ జిల్లా చేగుంట మండలం, పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి దీపక్ వయసు 23 సంవత్సరాలు తేదీ 07-02-2024 ఉదయం 8 గంటలకు అయోధ్యకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళినాడు అని తిరిగి ఇప్పటి వరకు ఇంటికి రానందున వారి కుటుంబ సభ్యులు అతని ఫోన్ నెంబర్ 7981146599 కు ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని …

యువకుడు అదృశ్యం

సి కే న్యూస్ చేగుంట ప్రతినిధి కొండి శ్రీనివాస్ ఫిబ్రవరి 11

మెదక్ జిల్లా చేగుంట మండలం, పరిధిలోని కిష్టాపూర్ గ్రామానికి చెందిన పోతుగంటి దీపక్ వయసు 23 సంవత్సరాలు తేదీ 07-02-2024 ఉదయం 8 గంటలకు అయోధ్యకు వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్ళినాడు అని తిరిగి ఇప్పటి వరకు ఇంటికి రానందున వారి కుటుంబ సభ్యులు అతని ఫోన్ నెంబర్ 7981146599 కు ఫోన్ చేయగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని చుట్టుపక్కల వారి బంధువుల వద్ద వెతికిన ఎలాంటి ఆచూకీ లభించలేదు అని దీపక్ తాత అయిన పోతుగాంటి బాల్ నరసయ్య చెప్పారు,

అతని ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్సై హరీష్ గౌడ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Updated On 11 Feb 2024 10:36 PM IST
cknews1122

cknews1122

Next Story