సూర్యాపేటజిల్లాలో దారుణం... ఇంటర్ విద్యార్థిని సూసైడ్ కలకలం సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వైష్ణవి మృతిపై అనుమానాలు ఉన్నాయని, నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి కుటుంబసభ్యులు, బంధువులు. గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. సూర్యాపేట పెన్ పహాడ్ రహదారిపై …

సూర్యాపేటజిల్లాలో దారుణం...

ఇంటర్ విద్యార్థిని సూసైడ్ కలకలం

సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

వైష్ణవి మృతిపై అనుమానాలు ఉన్నాయని, నిజనిర్ధారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వైష్ణవి కుటుంబసభ్యులు, బంధువులు.

గురుకుల పాఠశాల ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. సూర్యాపేట పెన్ పహాడ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ట్రాఫిక్ జామ్ అయింది.

కాగా సూర్యాపేట ఇమాంపేట బాలికల గురుకుల పాఠశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థిని వైష్ణవి తన హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.

సూర్యాపేటలోని 9వ వార్డు ఎన్టీఆర్ కాలనీకు చెందిన విద్యార్థినిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Updated On 11 Feb 2024 12:05 PM IST
cknews1122

cknews1122

Next Story