మేడారం జాతరకు సర్వం సిద్ధం సికె న్యూస్ ప్రతినిధి ములుగు -మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు ఈ రోజు తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా అధికారులతో కలిసి తల్లులను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి …

మేడారం జాతరకు సర్వం సిద్ధం

సికె న్యూస్ ప్రతినిధి ములుగు

-మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ వన దేవతలను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు

ఈ రోజు తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా అధికారులతో కలిసి తల్లులను దర్శించుకున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క గారు అనంతరం మాట్లాడుతూ మేడారం జాతర కు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం అని భక్తులు పెద్ద ఎత్తున తరలి వెచ్చే అవకాశం ఉన్నందున భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ఉండేందుకు అధికారులు అన్ని విధాలుగా సిద్దంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం జాతరకు వచ్చే మహిళలకు ఉచిత బస్ ప్రయాణం కల్పిస్తుంది అని ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పోలీసులు ఏర్పాటు చెయ్యడం జరుగుతుంది

ఈ నెల 23 న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు అదే విధంగా గవర్నర్ తో పాటు రాష్ట్రపతి గారు వచ్చే అవకాశం ఉందని భక్తులు తల్లులను దర్శించుకోవడానికి క్యు లైన్లు
సంఖ్యను పెంచడం జరిగిందని మంత్రి సీతక్క గారు అన్నారు

తెలంగాణ కుంభమేళా…మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడం జరిగిందని ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది.

అయితే ఇప్పటికే భక్తులు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో రెండేళ్లకోసారి సమ్మక్క, సారక్కల జాతర నిర్వహిస్తా తెలంగాణ కుంభమేళా…

మేడారం మహా జాతరకు అన్ని ఏర్పాట్లు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యడం జరిగిందని ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు సమ్మక్క, సారలమ్మ జాతర జరగనుంది. ఇప్పటికే భక్తులు పెద్దఎత్తున అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

ఆసియా ఖండంలోనే అతి పెద్ద గిరిజన జాతర. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న జాతర కోసం అభివృద్ధి పనులను వేగవంతం చేశారు అధికారులు జంపన్నవాగు పై స్నాన ఘట్టాలు, క్యూ లైన్లు, తాగునీరు, రోడ్లు, బస్టాండ్ అన్ని పనులు పూర్తి చేయడం జరిగిందని మంత్రి సీతక్క అన్నారు

Updated On 11 Feb 2024 2:07 PM IST
cknews1122

cknews1122

Next Story