వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే... ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకొచ్చింది.. మంత్రి రోజా వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే… వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని మంత్రి రోజా నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఇవాళ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు. వైఎస్ షర్మిలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ పేరు షర్మిల వాడుకుంటోందని ఆగ్రహించారు.చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని ఎద్దెవా చేశారు. తన పార్టీనీ కాంగ్రెస్‌లో …

వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే...

ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకొచ్చింది.. మంత్రి రోజా

వైఎస్ ఆశయాల కోసం జగన్ వస్తే… వైఎస్ ఆస్తుల కోసం షర్మిల రోడ్డుమీదకు వచ్చిందని మంత్రి రోజా నిప్పులు చెరిగారు. తిరుపతిలో ఇవాళ మంత్రి రోజా మీడియాతో మాట్లాడారు.

వైఎస్ షర్మిలకు మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు.చంద్రబాబుకు మేలు చేయడానికి వైఎస్ పేరు షర్మిల వాడుకుంటోందని ఆగ్రహించారు.చంద్రబాబు వదిలిన బాణం వైఎస్ షర్మిల అని ఎద్దెవా చేశారు.

తన పార్టీనీ కాంగ్రెస్‌లో విలీనం చేశానని… కాంగ్రెసు బతికి ఉన్నంత కాలం తన పార్టీ ఉంటుందని షర్మిల తెలిపారు. వైఎస్ పాలనకు జగన్ పాలనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు.

మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.నగరిలో రోజా దోపిడీ జబర్దస్తీగా చేస్తోందని ఆరోపించారు. నగరిలో నలుగురు ఎమ్మెల్యేలు ఉన్నారనారు. రోజా, రోజా భర్త, ఇద్దరు అన్నలు అందరూ మంత్రులు, ఎమ్మెల్యేలేనని ఎద్దేవా చేశారు. రోజా, వారి కుటుంబ కళ్లు పడితే నగరిలో సెంటూ స్థలం ఉండదని ఆరోపించారు.

ఇసుక, గ్రావెల్, మద్యం దందా నుంచి భూ కబ్జాలకు నగరినీ రోజా అడ్డగా చేసుకుందని మండిపడ్డారు. పేదలు చిన్న ఇల్లు కట్టుకుంటే అనుమతులకు కమీషన్ దోచుకుంటున్నారన్నారు. చిన్న ఉద్యోగం ట్రాన్స్‌ ఫర్ కావాలన్న రోజా కుటుంబానికి కమీషన్ ఇవ్వాల్సిందేనని అన్నారు.

మంత్రిగా ఉండి నగరికి రోజా ఒక్క అభివృద్ధి చేసిందేమీ లేదన్నారు. కరెంటు ఛార్జీల వల్ల నగరిలో చేనేత కార్మికుల వేలకు, వేలు బిల్లులు కట్టాల్సి వస్తోందన్నారు. ఏ రోజైనా నగరి కార్మికుల కోసం కాని పెంచిన, కరెంట్ బిల్లు గురించి అయిన రోజా మాట్లాడారా అని ప్రశ్నించారు.

వైఎస్ కూతురుగా షర్మిల ఒక్క మంచికూడా చేయలేదని వైసీపీ ఓట్లు చీల్చడానికి షర్మిల వచ్చిందని ఆగ్రహించారు. ప్రత్యేక హోదా లేకుండా ఏపీని విభజించిన కాంగ్రెసులో, వైఎస్ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసినా పార్టీలో షర్మిల చేరి జగన్ పైన, నాపై విషం చిమ్ముతోందని ఆగ్రహించారు.

షర్మిల కాంగ్రెస్‌లో చేరి వైఎస్ఆర్ ఆత్మక్షోభించే విధంగా చేసిందని చురకలు అంటించారు. వైఎస్ ఆర్ కుఆయన ఆశయాలకు నిజమైన వారసుడు జగన్ మాత్రమేనన్నారు మంత్రి రోజా.

Updated On 12 Feb 2024 4:43 PM IST
cknews1122

cknews1122

Next Story