కేటీఆర్ బస్సుపై కోడి గుడ్లతో దాడి సికె న్యూస్ ప్రతినిధి నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తాన్న బస్సుపై ఎన్ఎస్ఈూఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్ల దుస్తువులు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. నల్లగొండ బహిరంగ సభకు వెళ్తుండగా కేటీఆర్, హరీష్ తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో లంచ్ ముగించుకొని బహిరంగసభకు బయలుదేరిన బస్సులను.. …

కేటీఆర్ బస్సుపై కోడి గుడ్లతో దాడి

సికె న్యూస్ ప్రతినిధి

నల్గొండలో బీఆర్ఎస్ బహిరంగ సభకు వెళ్తాన్న బస్సుపై ఎన్ఎస్ఈూఐ కార్యకర్తలు కోడిగుడ్లతో దాడి చేశారు. నల్ల దుస్తువులు ధరించి గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.

నల్లగొండ బహిరంగ సభకు వెళ్తుండగా కేటీఆర్, హరీష్ తోపాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయాణిస్తున్న బస్సును కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

బీఆర్ఎస్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డి నివాసంలో లంచ్ ముగించుకొని బహిరంగసభకు బయలుదేరిన బస్సులను.. హైదరాబాదు రోడ్డులో ఉన్న హోటల్ మనోరామ దగ్గర భారీగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుపడ్డారు.

కేసీఆర్, కేటీఆర్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తూ.. బస్సులపై కోడిగుడ్లు విసిరారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు... కాంగ్రెస్ కార్యకర్తలను చదరగొట్టి రూట్ క్లియర్ చేశారు.

బీఆర్ఎస్ నేతలు ప్రయాణించే బస్సు దారిపొడుగున కేసీఆర్ కు వ్యతిరేక కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

దాంతో వీటీ కాలనీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ బస్సులో కేటీఆర్, హరీశ్ రావు ఉన్నారు.

Updated On 13 Feb 2024 4:37 PM IST
cknews1122

cknews1122

Next Story