ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు క్రీడల సామాగ్రిని అందజేసిన డాక్టర్ పెండెం కృష్ణ కుమార్….
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 13
ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ నాలుగు సార్లు పొందిన సమాజ సేవకులు ప్రముఖ కళాకారులు, రచయిత డాక్టర్ పెండెం కృష్ణ కుమార్ ఆలేరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కు అనేక దేశ నాయకుల,శాస్త్రవేత్తల చిత్రపటాలు,మెడికల్ కిట్టు, వాటర్ క్యాన్ ,ఆట వస్తువులు వాలీబాల్, చెస్ బోర్డు, స్కిప్పింగ్ రూప్స్, బాల్స్, క్రికెట్ బ్యాట్, వరల్డ్ మ్యాప్స్ ,గోడ గడియారం,మరియు క్లాత్ బాగ్స్ అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు శ్యామ సుందరి మాట్లాడుతూ..దాత పెండెం కృష్ణ కుమార్ ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల శారీరక మరియు మానసిక ఆరోగ్యం పెంపొందించడానికి క్రీడా సామాగ్రిని ,దేశభక్తిని పెంపొందించడానికి దేశ నాయకుల పటాలను,శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి శాస్త్రవేత్తల పటాలను, పర్యావరణ పరిరక్షణ అలవర్చడానికి క్లాత్ బ్యాగులను అందించడం జరిగింది.
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు ఖాజా అలి మాట్లాడుతూ భారత దేశ రాష్ట్రపతి ప్రశంసలు పొందిన వ్యక్తి పాఠశాలను సందర్శించడం విద్యార్థులలో ఎంతో స్ఫూర్తిని నింపిందని, అది వారి భవిష్యత్తుకు ఒక మార్గదర్శకంగా నిలుస్తుందని ,ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు వారి కృషి ఎంతో ప్రశంసదాయకమని, మెడికల్ రంగంలో వారు అందిస్తున్న సేవలు, అన్నదానాలు పేదలకు ఆపన హస్తంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు మహమ్మద్ ఖాజా అలీ హరినాథ్ రెడ్డి వేణు శేఖర్ లక్ష్మమ్మ విజయలక్ష్మి స్వర్ణలత కవిత మీరా వేణు మహమ్మద్ సలీం మొదలు వారు పాల్గొన్నారు.