నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త….
వయోపరిమితి 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళకు పెంచుతూ ఉత్తర్వులు..
రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని స్పష్టికరణ ….
యూనిఫాం సర్వీసులకు వర్తించదని ఉత్తర్వుల్లో వెల్లడి…
సి కే న్యూస్ (సంపత్) హైదరాబాద్
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది.యూనిఫామ్ సర్వీసలు మినహా ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితిని 44 ఏళ్ళ నుంచి 46 ఏళ్ళ కు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.2015 లో ఈ వయోపరిమితి 10 ఏళ్ళ పొడిగించి 44 ఏళ్లుగా ఖరారు చేసింది.ఆ తర్వాత 2022 లో మరోసారి 44 ఏళ్లుగా ప్రభుత్వం ఖరారు చేసింది..
వయోపరిమితిని పెంచాలని నిరుద్యోగ యువత నుండి ప్రభుత్వానికి అనేక అభ్యర్ధనలు రావడంతో రావడంతో ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి ఇప్పటి వరకు 44 ఏళ్లుగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం 46 ఏళ్లకు పెంచింది.
రెండేళ్ల పాటు ఇది అమల్లో ఉంటుందని ఉత్తర్వులు లో పేర్కొంది.యూనిఫాం సర్వీసులకు వర్తించదని ఉత్తర్వుల్లో వెల్లడించారు.వివిధ నియామక పరీక్షలకు సిద్ధమయ్యే వారికి ఇది గుడ్ న్యూస్ చెప్పుకోవాలి.