మరి కాసేపట్లో మేడిగడ్డకు బయల్దేరునున్న సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు
Ck news హైదరాబాద్ : ఫిబ్రవరి 13
అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిగారి స్పీచ్ స్క్రోలింగ్ పాయింట్స్..
తెలంగాణ సస్యశ్యామలం చేసేందుకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రభుత్వం
రూ.38,500 కోట్లతో 2008 లో టెండర్లు పిలిచారు.
వెంకటస్వామి గారి సూచనతో ప్రాణహితకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టారు.
రీడిజైన్ పేరుతో బీఆరెస్ ప్రభుత్వం ప్రాజెక్టు డిజైన్ మార్చి అంచనాలు పెంచింది.
రూ.1లక్ష 47 వేల కోట్లకు అంచనాలు పెంచారు
ఇసుక కదిలితే బ్యారేజ్ కూలింది అని వాళ్లు చెబుతున్నారు..
వాళ్లు ఇసుకలో పేక మేడలు కట్టారా?
ఇండియా పాకిస్తాన్ బార్డర్ లా ప్రాజెక్టు వద్ద పహారా పెట్టారు..
ఎవరినీ చూడకుండా అడ్డుకున్నారు.
కొంత మంది అధికారులు ఫైళ్ళు మాయంచేసినట్లు మీడియాలో కథనాలు వచ్చాయి..
దీంతో మా ప్రభుత్వం విజిలెన్స్ విచారణ చేపట్టింది.
విజిలెన్స్ విచారణ చేపట్టి పూర్తి నివేదిక ఇచ్చింది…
అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రతీ శాసనసభ సభ్యుడిపై ఉంది..
సభలో విజిలెన్స్ నివేదికపై చర్చ చేపట్టాల్సిన అవసరం ఉంది..
అందుకే మనమంతా మేడిగడ్డ బ్యారేజీని విజిట్ చేద్దాం..
కేసీఆర్ కు నేను విజ్ఞప్తి చేస్తున్నా..
మీరు, మీ శాసన సభ్యులు మేడిగడ్డకు రండి.. మీరు ఆవిష్కరించిన అద్భుతాలను దగ్గరుండి వివరించండి..
మీ అనుభవాలను అక్కడ అందరికీ వివరించి చెప్పండి..
తాజ్ మహల్ లాంటి ఆ అద్భుతాన్ని ఎలా సృష్టించారో అందరికీ చెప్పండి..
జరిగిన వాస్తవాలు తెలంగాణ ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందా? లేదా?
తప్పు జరిగిందా లేదా? జరిగితే కారణం ఎవరు?.. శిక్ష ఏమిటి..?
కాళేశ్వర్ రావు అని గతంలో ఆయన్ను ఆనాటి గవర్నర్ సంభోదించారు..
కాళేశ్వర్ రావు గారిని అక్కడికి రావాల్సిందిగా కోరుతున్నా..
మీకు బస్సుల్లో రావడం ఇబ్బంది అనుకుంటే… హెలికాఫ్టర్ కూడా సిద్ధంగా ఉంది..
రేపో ఎల్లుండో సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి గారు శ్వేతపత్రం విడుదల చేస్తారు
కాళేశ్వరం కథేంటో సభలో తెలుద్దాం…
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క, మంత్రులతోపాటు ఎమ్మెల్యేలంతా మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడానికి బయల్దేరనున్నారు.
అసెంబ్లీ దగ్గర నాలుగు ప్రత్యేక బస్సులను కూడా సిద్ధం చేశారు. అసెంబ్లీకి హాజరైన అనంతరం అందరూ కలిసి మేడిగడ్డకు బయలుదేరుతారు.
మధ్యహాన్నం 3 గంటలకు బ్యారేజీ వద్దకు చేరుకొను న్నారు. 2 గంటల పాటు సైట్ విజిట్ చేయనున్నారు. అక్కడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉండనుంది.
ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకు తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరు తారు…