కేసీఆర్ సభలో విషాదం.. హోంగార్డ్ మృతి! సికె న్యూస్ ప్రతినిధి నల్లగొండ వేదికగా నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 'ఛలో నల్లగొండ' బహిరంగ సభ ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఓ కారు పల్టీ కొట్టి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది. ఈ క్రమంలో చర్లపల్లి వద్ద కారు వేగంగా వచ్చి పల్టీలు కొడుతూ అక్కడే ఉన్న హోంగార్డు కిషోర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందగా.. ఒక …

కేసీఆర్ సభలో విషాదం.. హోంగార్డ్ మృతి!

సికె న్యూస్ ప్రతినిధి

నల్లగొండ వేదికగా నిర్వహించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 'ఛలో నల్లగొండ' బహిరంగ సభ ఓ కుటుంబంలో విషాదం నింపింది. సభకు వెళ్లి తిరుగు ప్రయాణంలో ఓ కారు పల్టీ కొట్టి అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులపైకి దూసుకెళ్లింది.

ఈ క్రమంలో చర్లపల్లి వద్ద కారు వేగంగా వచ్చి పల్టీలు కొడుతూ అక్కడే ఉన్న హోంగార్డు కిషోర్ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఓ కానిస్టేబుల్‌ మృతి చెందగా.. ఒక హోంగార్డ్‌ తీవ్రంగా గాయపడ్డాడు. ఇక బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే లాస్య నందిత కూడా ప్రమాదం బారిన పడ్డారు.

ఆమె కారును ఆటో ఢీకొట్టడంతో నందిత గాయపడ్డారు. అయితే ప్రమాదం నుంచి తాను సురక్షితంగా బయటపడ్డట్లు నందిత సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపింది.

Updated On 13 Feb 2024 9:29 PM IST
cknews1122

cknews1122

Next Story