రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన తహసీల్దార్‌ హైదరాబాద్: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేందుకు తహసీల్దార్‌ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో.. సత్యనారాయణ డ్రైవర్‌ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు …

రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన తహసీల్దార్‌

హైదరాబాద్: మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా శామీర్‌పేట తహసీల్దార్‌ సత్యనారాయణ ఏసీబీ వలకు చిక్కారు. రూ.10 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు.

గచ్చిబౌలిలో ఉంటున్న ఓ వ్యక్తికి చెందిన భూమి శామీర్‌పేటలో ఉంది. దానికి సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకం జారీ చేసేందుకు తహసీల్దార్‌ రూ.10 లక్షలు డిమాండ్ చేశారు.

దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో.. సత్యనారాయణ డ్రైవర్‌ బద్రి డబ్బు తీసుకుంటుండగా అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఆయన తీసుకోమంటేనే డబ్బు తీసుకున్నట్లు డ్రైవర్‌ అంగీకరించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో తహసీల్దార్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Updated On 13 Feb 2024 10:10 PM IST
cknews1122

cknews1122

Next Story