భువనగిరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో సామూహిక అక్షరాభ్యాసం…. సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 14 యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భువనగిరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బుధవారం రోజున వసంత పంచమి సందర్భం గా సామూహిక అక్షరాభ్యాసం మరియు ప్రీ ప్రైమరీ విద్యార్ధులకి స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ రఘు అఖిల మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే పాఠశాల …

భువనగిరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో సామూహిక అక్షరాభ్యాసం….

సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 14

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో భువనగిరి కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో బుధవారం రోజున వసంత పంచమి సందర్భం గా సామూహిక అక్షరాభ్యాసం మరియు ప్రీ ప్రైమరీ విద్యార్ధులకి స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్బంగా పాఠశాల ప్రిన్సిపాల్ రఘు అఖిల మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించడమే పాఠశాల ధ్యేయం గా పేర్కొన్నారు.

రాబోయే విద్యాసంవత్సరం లో మరిన్ని సరికొత్త ప్రమాణాలతో పాఠశాలను అభివృద్ధి చేస్తాం అని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Updated On 14 Feb 2024 4:30 PM IST
cknews1122

cknews1122

Next Story