గురుకుల స్కూల్ లైబ్రేరియన్ లో విరిసిన విద్యా కుసుమాలు..
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 14
పేదరికాన్ని లెక్క చేయకుండా ఇద్దరు అక్కా చెల్లెల్లు పట్టుబట్టి అనుకున్నది సాధించి యాదాద్రి భువనగిరి జిల్లాకే ఆదర్శంగా నిలిచారు. మంగళవారం ప్రకటించిన 1:1 గురుకుల స్కూల్ లైబ్రేరియన్ లో అక్కా సౌజన్య, చెల్లెలు భువన ఎంపిక అయ్యారు.
భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన అక్క సౌజన్య, మోటకొండూర్ గ్రామానికి చెందిన కొరటికంటి భువన శ్రీధర్ గౌడ్ ది స్వంత గ్రామం భువనగిరి పట్టణం. వీరి అమ్మ కుట్టు మిషన్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు.
కానీ ఇద్దరి అక్క చెల్లెల్లు మాత్రం చదువుకొని గొప్ప వాళ్ళు కావాలన్న తపనతో కష్టపడి చదివారు. వీరు బీటెక్, బీఈడీ, బీఎల్ఐసీ, ఏంఎల్ఐసీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఏ సోషియాలజీ వంటి మాస్టర్ డిగ్రీలు సాధించారు.గురుకుల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత వీరు హైదరాబాదులోని దిల్ సుఖ్ నగర్ లో ఉన్న యాదాద్రి స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు,
కుటుంబానికి చెందిన ఇద్దరు అక్కా చెల్లెలు గురుకులాలకు ఎంపిక కావడం గమనార్హమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒకే కుటుంబంలో జన్మించిన అక్కా చెల్లెలు ఇద్దరు పేదింటి అమ్మాయిలు,గౌడ సామాజిక వర్గానికి చెందిన మారగౌని భువన గౌడ్, మారగౌని సౌజన్య గౌడ్ లైబ్రేరియన్ స్కూల్లో ఎంపిక కి కావడం పట్ల గ్రామస్థులు, స్నేహితులు, బంధువులు సంతోషం వ్యక్తం చేస్తూ వారికి శుభాకాంక్షలు తెలిపారు,
వివిధ పీజీ కోర్సులను పూర్తి చేసి తమ లక్ష్యాన్ని సాధించిన ఈ పేదింటి విద్యా కుసుమాలు ఈరోజు యాదాద్రి జిల్లాలోనే ఆదర్శంగా నిలిచారు.ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ మా అమ్మ చిన్నప్పటి నుండి కష్టపడి చదిచింది అని తెలిపారు.
మధ్యతరగతి కుటుంబం లో పుట్టిన మేము చదువుకోవడం కోసం చాలా కష్టాలు పడ్డామని తెలిపారు, మా వివాహం అనంతరం కూడా భర్తల ప్రోత్సహం చాలా ఉందని వారి సహకారం లేకపోతే ఇంత దూరం వచ్చే వాళ్ళం కాదని అన్నారు.యువత అంత కూడా ఉన్నతమైన లక్ష్యాలను ఏర్పరచుకొని వాటిని సాధించే విధంగా అడుగులు వేయాలని సూచించారు.