— తన ప్రాణాలను అడ్డుపెట్టి ప్రజల ప్రాణాలు కాపాడిన ఆర్టీసీ డ్రైవర్.
— ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి
సికె న్యూస్ సత్తుపల్లి ప్రతినిధి మునీర్.
విధుల్లో ఉన్న ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతోమృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా పరిధిలో ఇవాళ చోటుచేసుకుంది. సత్తుపల్లి నుంచి ప్రయాణికులతో ఖమ్మం వెళ్తున్న ఆర్టీసీ బస్సు డ్రైవర్ శ్రీనివాస రావుకు ఉన్నట్టుండి హార్ట్ టాక్ వచ్చింది.
అప్పటికే రన్నింగ్లో ఉన్న బస్సును కల్లూర్ పాత
బస్టాండ్ సమీపంలో నిలిపి ప్రయాణికుల సాయంతో
సమీప కల్లూర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాడు.
ఈ క్రమంలో శ్రీనివాస్ రావును వైద్యుడు పరీక్షిస్తుండగానే మృతి చెందాడు.
తనకు గుండెపోటు వస్తున్న విషయాన్ని గమనించి బస్సును పక్కకు ఆపి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన డ్రైవర్ శ్రీనివాస రావుకు విధుల పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసిస్తూనే తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు ప్రయాణికులు.
మృతుడు శ్రీనివాస రావు వేంసూరు
మండలం, రామన్నపాలెం గ్రామానికి చెందిన వాడు,
అతనికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు.