జూపార్క్‌లో విషాదం.. సింహం దాడిలో యువకుడు మృతి..! తిరుపతి జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఎస్వీ జూపార్క్‌లో ఒక యువకుడిపై సింహం క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు. సెల్ఫీ దిగడం కోసం నిబంధనలు ఉల్లంఘించి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లు సమాచారం. కాగా, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు. కొత్తగా వచ్చేవారికి సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన వెంటనే …
![సింహం దాడిలో యువకుడు మృతి..! సింహం దాడిలో యువకుడు మృతి..!](https://cknewstv.in/wp-content/uploads/2024/02/images-2-4.jpeg)
జూపార్క్‌లో విషాదం.. సింహం దాడిలో యువకుడు మృతి..!
తిరుపతి జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నగరంలోని ఎస్వీ జూపార్క్‌లో ఒక యువకుడిపై సింహం క్రూరంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన అతను అక్కడికక్కడే మృతి చెందాడు.
సెల్ఫీ దిగడం కోసం నిబంధనలు ఉల్లంఘించి ఎన్‌క్లోజర్‌లోకి వెళ్లడంతో సింహం దాడి చేసినట్లు సమాచారం. కాగా, వెంటనే అప్రమత్తమైన సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు.
కొత్తగా వచ్చేవారికి సైతం అనుమతి నిరాకరించారు. విషయం తెలిసిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, సెల్ఫీ దిగడానికి ముందు సింహం ముందు సదరు యువకుడు తొడ కొట్టినట్లు సమాచారం. సింహంతో పరాచికాలు ఆడి చివరకు ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని స్థానికులు అంటున్నారు.
దాడికి ముందు సింహం దాడి నుంచి తప్పించుకునేందకు ఆ యువకుడు చెట్టు ఎక్కాడని అక్కడ చూసిన వారు చెబుతున్నారు. అనంతరం దర్యాప్తు చేస్తున్నారు. దాడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
![cknews1122 cknews1122](/images/authorplaceholder.jpg?type=1&v=2)