బీజేపీకి బిగ్ షాక్…
కాంగ్రెస్ లోకి ఈటల రాజేందర్?
బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పరిస్థితి అత్యంత దారుణంగా తయారయింది. గులాబీ పార్టీని వీడిన తర్వాత బీజేపీలో చేరిన ఈటల రాజేందర్ కు…
అక్కడ సరైన స్థానం దక్కడం లేదు.
ముఖ్యంగా బండి సంజయ్ కుమార్, ఈటల రాజేందర్ మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయని సమాచారం. బండి సంజయ్ తో వివాదాలు ఉన్న నేపథ్యంలోనే హుజురాబాద్ నియోజకవర్గం లో ఈటెల రాజేందర్ ఓడిపోయారని కూడా కొంతమేర ప్రచారం జరిగింది.
ఇక మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో రెండు చోట్ల ఓడిపోయిన ఈటల రాజేందర్… ఎలాగైనా ఎంపీగా పోటీ చేసి గెలవాలని స్కెచ్ వేస్తున్నారు. ఇందులో భాగంగానే మల్కాజ్గిరి ఎంపీ టికెట్ అడిగారట. అయితే దీనికి బీజేపీ అధిష్టానం ఒప్పుకోవడం లేదని సమాచారం.
దీంతో బీజేపీ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఈటల రాజేందర్ నిర్ణయం తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఇందులో భాగంగానే తాజాగా కాంగ్రెస్ నేతలతో సమావేశం అయ్యారు ఈటల రాజేందర్. నిన్న పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
అనంతరం మైనంపల్లి హనుమంతరావుతో పట్నం మహేందర్ రెడ్డి సమావేశం అయ్యారు. అయితే వీరి సమావేశంలో ఈటల రాజేందర్ ప్రత్యక్షమయ్యారు.
దీంతో ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళతారని జోరుగా ప్రచారం అందుకుంది. అంతేకాదు కరీంనగర్ ఎంపీగా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జోరుగా జరుగుతోంది.
ప్రస్తుతం కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీలో అసలైన లీడర్ లేడు. మొన్నటి వరకు ఉన్న పొన్నం ప్రభాకర్ ఇప్పుడు మంత్రిగా పని చేస్తున్నారు. వీటన్నిటిని లెక్కలు వేసుకున్న ఈటల రాజేందర్ … కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.