కోటి రూ” విలువ గల నిషేధిత గంజాయిని స్వాధీనం చేసుకున్న భద్రాచలం పోలీసులు.
సీ కే న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, ( సాయి కౌశిక్),
ఫిబ్రవరి 17,
శుక్రవారం పి వి ఎన్ రావు సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్, పి ఎస్ భద్రాచలం టౌన్ తన సిబ్బందితో భద్రాచలం పట్టణం నందు ఇందిరా గాంధీ బొమ్మ సెంటర్ వద్ద ఆకస్మిక వాహనాల తనిఖీలు చేస్తుండగా ఒడిస్సా రాష్ట్రం, మల్కాన్ గిరి నుండి హైదరాబాద్ వెళ్ళు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ కి చెందిన బస్సును ఆపి తనిఖీ చేస్తుండగా,ఒక వ్యక్తి పోలీస్ వారిని చూసి కంగారూ పడుతూ భయంతో బస్ లో నుండి కిందకు దిగడానికి ప్రయత్నిస్తుండగా వెంటనే పోలీస్ వారు సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారించారు.
పట్టుబడిన నిందితుడుతో పాటు బస్ లోనే ఉన్న 7 గురు అతని సమీప బందువులు కలిసి సులువుగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ నిషేధిత గంజాయిని కలిమెల, మల్కనగిరి, ఒడిస్సా రాష్ట్రం నుండి కోలా ఆనంద్ @ బుజ్జి మరియు బాల్ రెడ్డి ల నుండి సుమారు 4 క్వింటాల గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి,అట్టి గంజాయిని ప్లాస్టిక్ ట్రేల అడుగు భాగంలో మరియు డోర్ మ్యాట్ ల మధ్య భాగంను కత్తిరించి వాటిని ఒక దానిమీద మరొకటి పేర్చినారు.
వాటి మధ్య భాగాలలో వారు కొనుగోలు చేసిన గంజాయి ప్యాకెట్లను ఎవరూ కనిపెట్టకుండా దాచిపెట్టి సాధారణ ప్రయాణికులు లాగా బస్సు సిబ్బందిని మరియు తోటి ప్రయాణికులను నమ్మించి ప్లాస్టిక్ మరియు డోర్ మ్యాట్ లు అమ్మే వాళ్ళలా నటిస్తూ అక్రమంగా గంజాయిని హైదరాబాదుకు తరలించి అక్కడ అధిక ధరకు అవసరం ఉన్న వ్యక్తులకు అమ్మే ఉద్దేశ్యంతో వెళ్ళుచుండగా భద్రాచలం టౌన్ పోలీస్ వారు సదరు వ్యక్తులను అరెస్టు చేయడమైనది.
సుమారు ఒక కోటి రూపాయల విలువ గల ప్రభుత్వ నిషేధిత గంజాయిని పోలీసు వారు స్వాధీనపర్చుకొని నిందితులపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు తెలిపిన పోలీస్ అధికారులు.