విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ…
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 17
ఆలేరు మండలం టంగుటూరు గ్రామం వై ఆర్ ఎం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం రోజున ఘనంగా స్వపరి పాలన దినోత్సవాన్ని జరుపుకున్నారు.విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి పాఠాలు బోధించారు.
పాఠశాల విద్యార్థినులు వివిధ పాత్రలు ప్రధానోపాధ్యాయులుగా జె.మానస,డి ఈ ఓ గా వినయ్,కలెక్టర్ వేణుతేజ,ఎమ్మెల్యేగా భరద్వాజ్, సర్పంచ్ గా విజయ్, ఎస్ఎంసి చైర్మన్ గా విక్రమ్ మరియు ఉపాధ్యాయులు గా కీర్తన, హారిక, శ్రీజ, మధునిక మనోజ్, ఉదయ్, జహంగీర్, ప్రణయ్, శిరీష, లిఖిత, హారిక పాత్రలు పోషించారు.అనంతరం జరిగిన సమావేశంలో ప్రధానోపాధ్యాయులు బూడిద శ్రీనివాస్ విజేతలకు బహుమతులు అందించరు.
ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు ఎం.రవి కుమార్,జి. రవీంద్ర చారి,బి. సైదయ్య టి. సంధ్యారాణి, బల్ల వెంకటేశ్వర్లు, ఎం. లింగయ్య తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రిటైర్డ్ ఉపాధ్యాయులు గంగిటి కిష్టయ్య, జి.ప్ర.ఉ.పాఠశాల శారద పేట ఉపాధ్యాయులు టి. సంజీవరెడ్డి,కె.చంద్రశేఖర్ పాల్గొని అందించి అభినందనలు తెలిపారు..