
విషజ్వరంతో చికిత్స పొందుతూ బాలుడు మృతి..
కూసుమంచి : విషజ్వరంతో చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందిన ఘటన కేశవ పురం గ్రామ పంచాయతీ పరిధిలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. మండలంలోని కేశవ పురం గ్రామ పంచాయతీ పరిధిలో గల చింతల తండా గ్రామానికి చెందిన ధరావత్ నాగేశ్వరరావు కుమారుడు వర్షిక్ తేజ (6) అనే బాలుడు గత వారం రోజులుగా విష జ్వరంతో బాధపడుతూ ఖమ్మంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి సమయంలో మృతి చెందాడు.
బాలుడు కూసుమంచిలో ఒక ప్రైవేటు స్కూల్‌లో యూ.కె. జి చదువుతున్నాడు. బాలుడి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.