రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం…
సి కే న్యూస్ (సంపత్) ఫిబ్రవరి 18
ఆలేరు పట్టణ కేంద్రంలోని అర్పిత నర్సింగ్ హోమ్ పక్కన రాఘవ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు పులిపలుపుల మహేష్ ఆధ్వర్యంలో ఆదివారం రోజున రక్తదాన శిబిరం నిర్వహించారు..
శిబిరంలో సుమారు 39 మంది రక్తదానం నిర్వహించారని అన్ని దానాల కన్నా ప్రాణదానం మిన్నా అని రక్త దానం చేయాలని యువకులకు పులిపలుపుల మహేష్ పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రాఘవ స్వచ్ఛంద సేవా సభ్యులు జితేందర్ నరసింహ రాజు మోరిగాడి ఉపేందర్ కళ్యాణ్ సేవా సంస్థ సభ్యులు తదితరులు పాల్గొన్నారు..