— జిల్లా టాపర్ గా నిలిచిన వి .వి .విద్యాలయ విద్యార్థి. — ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో -అభినందనలు తెలిపిన కరస్పాండెంట్ ఒగ్గు భగవాన్ రెడ్డి, గోరింట్ల వంశీ కృష్ణ. ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023 - 24 విద్యా సంవత్సరము నకు గాను నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1500 పాఠశాలల నుండి 7000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను చాటారు. వి …

— జిల్లా టాపర్ గా నిలిచిన వి .వి .విద్యాలయ విద్యార్థి.

— ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో

-అభినందనలు తెలిపిన కరస్పాండెంట్ ఒగ్గు భగవాన్ రెడ్డి, గోరింట్ల వంశీ కృష్ణ.

ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ వారి ఆధ్వర్యంలో 2023 - 24 విద్యా సంవత్సరము నకు గాను నిర్వహించిన పలు పోటీ పరీక్షల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1500 పాఠశాలల నుండి 7000 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని వారి ప్రతిభను చాటారు. వి . వి. విద్యాలయం స్కూల్ సత్తుపల్లి నుండి ఆరవ తరగతి చదువుతున్న వనమా రెడ్డి చెర్వి భూమి పెయింటింగ్ విభాగం లో రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొని జిల్లా టాపర్ గా నిలిచింది.

ఖమ్మం లోని భక్త రామదాసు కళాక్షేత్రము నందు ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ సంస్థ ఆధ్వర్యంలో అర్బన్ సిటీ డెవలపర్ మేనేజింగ్ డైరెక్టర్ రమేష్ బాబు గారు, మేనేజింగ్ పార్టనర్ వెంకట రెడ్డి, జోయల్ డేనియల్ చేతుల మీదుగా చెర్వి భూమి జిల్లా టాపర్ అవార్డు స్వీకరించడం జరిగింది.

అదే విధంగా 2023-24 సంవత్సరం నకు గాను వి. వి. విద్యాలయం స్కూల్ సత్తుపల్లి నుండి ఉత్తమ కో-ఆర్డినేటింగ్ టీచర్ గా ఎంపికైనటువంటి ఎమ్. రమేష్ ని ప్రముఖుల ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. పాఠశాల కరెస్పాండంట్ ఒగ్గు భగవాన్ రెడ్డి , ప్రధానోపాధ్యాయులు గోరింట్ల వంశీ కృష్ణ , ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాఠశాల తరుపున ఇద్దరిని అభినందించడం జరిగింది.

ఈ సందర్బంగా ఇండియన్ బ్రిలియంట్ ఒలింపియాడ్ మేనేజింగ్ డైరెక్టర్ అంతోటి రామకృష్ణ పరీక్షలు ఇంత ఘనంగా నిర్వహించడానికి ప్రోత్సహించిన అన్ని జిల్లాల స్కూల్ యాజమాన్యాలకు, ప్రధానోపాధ్యాయులకు, సహకరించిన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదములు తెలిపారు. అవార్డులు అందుకున్న ప్రతీ ఒక్కరికి అభినందనలు తెలిపారు.

Updated On 18 Feb 2024 3:39 PM IST
cknews1122

cknews1122

Next Story