ఎంపీ టికెట్ రేసులో మల్లు రవి వర్సెస్ సంపత్ కుమార్
సీ కే న్యూస్ ప్రతినిధి, కొల్లాపూర్:
ఎవరికి వారే సాటి
నాగర్ కర్నూల్ ఎంపీ టికెట్ కొరకు రేసులో వీరిద్దరు
ఇప్పటికే ఢిల్లీ ప్రత్యేక అధికార బాధ్యతలు స్వీకరించిన మల్లురవి
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి గురై ఎంపీ టికెట్ ఆశిస్తున్న సంపత్ కుమార్
ఇక అధిష్టానం టికెట్ ఎవరికి ఇస్తుందన్న అంశంపై ప్రజల ఎదురుచూపులు
నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలోని అన్ని పార్టీల నాయకులను పార్లమెంట్ టికెట్ విషయంలో ఆ పరిధిలోని ప్రజలు పార్లమెంట్ టికెట్ జనాభా దామాషా ప్రకారం మాదిగలకే కేటాయించాలనే డిమాండ్ పై చాలా గట్టిగానే చర్చలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చినట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి పార్లమెంట్ టికెట్ కొరకు 26 మంది దరఖాస్తు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే .
అందులో ప్రత్యేకంగా ఢిల్లీ అధికార ప్రతినిధి మల్లు రవి మరియు అలంపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ లు మాత్రం ఇద్దరూ ఒకరికి ఒకరు పోటాపోటీగా నాగర్ కర్నూల్, కొల్లాపూర్ ,అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలలో పెద్దపెద్ద ఫ్లెక్సీలు వేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే
అయితే జనాభా దామాషా ప్రకారం నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో ఎక్కువగా మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు ఉన్నారు కాబట్టి కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ కి పార్లమెంట్ టికెట్ ఇవ్వాలని ఆ పార్లమెంటు పరిధిలోని అన్ని నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్నారని కూడా ప్రజల మధ్య ఊహాగానాలు రేకెత్తిస్తున్నాయి
ఢిల్లీ అధికార ప్రతినిధి అయిన మల్లు రవి ఢిల్లీలో ప్రత్యేక అధికార పదవి బాధ్యతలు చేపట్టారు అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ పార్టీలోనే కొనసాగుతూ కాంగ్రెస్ పార్టీకి న్యాయం చేస్తూ ఉంటున్నాడు
అందులో కూడా ఆయన యువకుడు మరియు రానున్న తరాలకు ఆదర్శంగా నిలుస్తాడన్న నమ్మకంతో ప్రజలు కూడా సంపత్ కుమార్ వైపు ఎక్కువ మొత్తం లో ముగ్గు చెబుతున్నారన్న విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చింది అయినా కూడా సంపత్ కుమార్ మాదిగ సామాజిక వర్గంలో అన్ని ప్రజాసంఘాల మధ్యలో మంచి పేరు కలిగిన వ్యక్తిగా ఆ వర్గం ప్రజలు గుర్తించారన్న విషయం కూడా అందరికీ తెలిసిందే
ఇక కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పార్లమెంట్ టికెట్ ను మల్లు రవి కి ఇస్తుందా లేక జనాభా ఎక్కువ కలిగిన మాదిగలకు కేటాయిస్తుందా అన్న అంశంపై నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలోని ప్రజలు ఇంకా వేచి చూడాల్సిందే