HyderabadPoliticalTelangana

జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం.. మ్యాన్ హోల్ లో పడిన చిన్నారి

జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం.. మ్యాన్ హోల్ లో పడిన చిన్నారి

జీహెచ్ఎంసీ సిబ్బంది నిర్లక్ష్యం.. మ్యాన్ హోల్ లో పడిన చిన్నారి

హైదరాబాద్ నగరంలో అధికారులు నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. పాతబస్తీ యాకుత్‌పురాలో మూతతెరిచి వదిలిన మ్యాన్‌హోల్‌లో స్కూల్‌కు వెళ్తున్న ఓ చిన్నారి విద్యార్థిని పడిపోయిన ఘటన స్థానికులను ఉలిక్కిపడేలా చేసింది.

జీహెచ్ఎంసీ సిబ్బంది డ్రైనేజ్ మూతను తెరిచి వదిలేయడంతో ఈ ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు విద్యార్థిని తల్లి గమనించి వెంటనే బాలికను పైకి లాగి కాపాడింది. స్థానికులు కూడా అక్కడికి చేరుకుని సహాయం చేశారు. బాలిక క్షేమంగా బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ఈ ఘటనతో మ్యాన్‌హోల్‌లు ఎంత ప్రాణాంతకంగా మారుతున్నాయో మరోసారి రుజువైంది.

తెలుగు రాష్ట్రాల్లో గతంలోనూ అనేకమంది ప్రాణాలు మ్యాన్‌హోల్‌లలో జారిపడి బలైపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినప్పటికీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.

స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ – “మ్యాన్‌హోల్ మూతను ఎందుకు తెరిచి వదిలేశారు? ఎలాంటి హెచ్చరిక బోర్డులు ఎందుకు పెట్టలేదు? వర్షం నీటికి మార్గం కల్పించేందుకని మూతలు తీస్తే, ప్రాణాల భద్రతను ఎవరు చూసుకోవాలి? చిన్నారి ప్రాణానికి ప్రమాదం జరిగి ఉంటే బాధ్యత ఎవరిది?” అని ప్రశ్నిస్తున్నారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇప్పటికైనా అధికారులు ఇలాంటి నిర్లక్ష్యాన్ని అరికట్టి, మ్యాన్‌హోల్‌ల భద్రతపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button